రాధేశ్యామ్ చిత్రానికి జ‌స్టిన్ ప్ర‌భాక‌రన్ మ్యూజిక్

Published On: October 21, 2020   |   Posted By:

రాధేశ్యామ్ చిత్రానికి జ‌స్టిన్ ప్ర‌భాక‌రన్ మ్యూజిక్

“రెబ‌ల్ స్టార్” ప్ర‌భాస్ రాధేశ్యామ్ చిత్రానికి సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న మ్యూజిక్ డైరెక్ట‌ర్ జ‌స్టిన్ ప్ర‌భాక‌రన్

అక్టోబర్ 23న, ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ మోష‌న్ పోస్ట‌ర్ 

“రెబ‌ల్ స్టార్” ప్ర‌భాస్ హీరోగా గొపికృష్ణ మూవీస్‌, యూవి క్రియెష‌న్స్, డైరెక్ట‌ర్ రాధాకృష్ణ కుమార్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న చిత్రం రాధేశ్యామ్‌.

బాహుబలి1, బాహుబ‌లి2 , సాహో వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకున్న “రెబ‌ల్‌స్టార్” ప్ర‌భాస్ త‌న 20 వ చిత్రాన్ని జిల్ చిత్ర ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం లో తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే.

“రెబ‌ల్‌స్టార్” ప్ర‌భాస్ స‌ర‌స‌న బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని “రెబ‌ల్‌స్టార్” డాక్టర్ యూ.వి.  కృష్ణంరాజు గారు స‌మ‌ర్పించ‌గా, వంశీ, ప్ర‌మెద్‌, ప్రసీధ‌  లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్నో సూప‌ర్‌హిట్స్ అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థలు గోపికృష్ణ మూవీస్, యూవి క్రియెష‌న్స్ బ్యాన‌ర్స్‌ పై నిర్మిస్తున్నారు.

ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలీ వెర్ష‌న్స్ కి సంగీత‌ దర్శ‌కునిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ‌తంలో ప‌లు హిట్ చిత్రాల‌కు జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.

ఇక ఇటీవ‌లే విడుద‌ల చేసిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ కి విశేష స్పంద‌న ల‌భించింది. ఈ నేప‌థ్యంలో న‌వ‌రాత్రులు అలానే అక్టోబ‌ర్ 23న‌ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా “బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్” పేరిట మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేస్తున్నారు.

రాధేశ్యామ్ చిత్ర యూనిట్ ప్ర‌స్తుతం యూర‌ప్ లో షూటింగ్ జ‌రుపుకుంటోంది.  తెలుగు, మలయాళం, హిందీ, తమిళ, క‌న్న‌డ‌ భాషల్లో రాధేశ్యామ్ ను విడుద‌ల చేయడానికి చిత్ర నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు:

ప్రభాస్, పూజా హెగ్డే, స‌త్య‌రాజ్‌, భాగ్య‌శ్రీ, కునాల్ రాయ్ క‌పూర్‌, జ‌గ‌ప‌తిబాబు, జ‌య‌రాం, స‌చిన్ ఖేడ్‌క‌ర్‌, భీనా బెన‌ర్జి, ముర‌ళి శ‌ర్మ‌, శాషా ఛ‌త్రి, ప్రియ‌ద‌ర్శి, రిద్దికుమార్‌, స‌త్యాన్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

చిత్ర స‌మ‌ర్ప‌కులు : “రెబ‌ల్‌స్టార్” డాక్ట‌ర్ యు వి కృష్ణంరాజు
సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస
ఎడిటర్ :  కొటగిరి వెంక‌టేశ్వ‌రావు
యాక్ష‌న్‌, స్టంట్స్‌ : నిక్ ప‌వ‌ల్‌
మ్యూజిక్ :  జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్
కొరియోగ్ర‌ఫి : వైభ‌వి మ‌ర్చంట్‌
కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌ : తోట విజ‌య భాస్క‌ర్ అండ్ ఎకా ల‌ఖాని
నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్రసీధ‌
దర్శకుడు : రాధాకృష్ణ కుమార్