రామారావు ఆన్ డ్యూటీ ప్రీరిలీజ్ ఈవెంట్

Published On: July 25, 2022   |   Posted By:

రామారావు ఆన్ డ్యూటీ ప్రీరిలీజ్ ఈవెంట్

రామారావు ఆన్ డ్యూటీ ప్రీరిలీజ్ ఈవెంట్

రామారావు ఆన్ డ్యూటీ’ నాకు చాలా డిఫరెంట్ మూవీ: ‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాస్ మహారాజా రవితేజ

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ విడుదలకు కానుంది.

వేలాది మంది అభిమానుల సమక్షంలో ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. విజయవంతంగా జరిగిన వేడుకకు నేచురల్ స్టార్ నాని, స్టార్ దర్శకుడు బాబీ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. రవితేజ, శరత్ మండవ, నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ , వేణు తొట్టెంపూడి, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్, అన్వేషి జైన్, సామ్ సిఎస్, సత్యన్ సూర్యన్, ప్రవీణ్ , కళ్యాణ చక్రవర్తి తదితరులు ఈవెంట్ లో పాల్గొన్నారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాస్ రవితేజ మాట్లాడుతూ.. ‘రామారావు ఆన్ డ్యూటీ’ నాకు చాలా డిఫరెంట్ మూవీ. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. ఇంతకుముందు ఎప్పుడూ చేయనిది. దర్శకుడు శరత్ చాలా అద్భుతమైన సినిమా తీశాడు. నిర్మాత సుధాకర్ నాకు మంచి స్నేహితుడు. కూల్, పాజిటివ్ పర్శన్. అలాంటి వారితో ఎన్ని సినిమాలైన చేయడానికి నేను రెడీ. సుధాకర్, శ్రీకాంత్ లకు అల్ ది బెస్ట్. ఈవెంట్ కి వచ్చిన దర్శకుడు బాబీకి థాంక్స్. నాని అంటే నాకు చాలా ఇష్టం. సౌత్ ఇండియాలోనే నాని మంచి నటుడు. రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ లు బ్యూటీఫుల్ గా వుంటారు. సీసా పాటలో అన్వేషి జైన్ అలరిస్తుంది. ఈ పాట చాలా బాగా వచ్చింది. వేణు తొట్టెంపూడితో నేను స్వయంవరం సినిమా చేయాలి. కానీ మిస్ అయ్యింది. మళ్ళీ కలిశాం. ఇంక గ్యాప్ ఇవ్వద్దు. ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ 95 లుక్ ని అద్భుతంగా తీసుకొచ్చారు. ఎడిటర్ ప్రవీణ్ మంచి వర్క్ ఇచ్చారు. డివోపీ సత్యన్ సూర్యన్ వండర్ ఫుల్ విజువల్స్ ఇచ్చారు. ఆయనతో మళ్ళీ పని చేయాలనీ వుంది. ఈ సినిమాకి సౌండ్ చాలా ముఖ్యం. దీనికి వందశాతం న్యాయం చేశాడు సామ్ సిఎస్. ఎక్స్ లెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఫైట్ మాస్టర్ స్టంట్ శివ, కెవిన్ సూపర్ గా యాక్షన్ డిజైన్ చేశారు. జులై 29న ‘రామారావు ఆన్ డ్యూటీ థియేటర్ కి వస్తుంది, అంతా థియేటర్ లో కలుద్దాం” అన్నారు.