వరల్డ్ వైడ్ రూ 250 కోట్ల వసూళ్లను దాటిన డంకీ చిత్రం

Published On: December 27, 2023   |   Posted By:

వ‌ర‌ల్డ్ వైడ్‌ రూ 250 కోట్ల వ‌సూళ్ల‌ను దాటిన డంకీ చిత్రం

2023 టాప్ గ్రాస‌ర్ క్ల‌బ్‌లో షారూక్, రాజ్‌కుమార్ హిరాని డంకీ వ‌ర‌ల్డ్ వైడ్‌ రూ.250 కోట్ల వ‌సూళ్ల‌ను దాటిన చిత్రం

కింగ్ ఖాన్ షారూక్‌, రాజ్‌కుమార్ హిరాని క‌ల‌యిక‌లో రూపొందిన చిత్రం డంకీ. వ‌ర‌ల్డ్ వైడ్ ఈ చిత్రం క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 21న రిలీజైన సంగ‌తి తెలిసిందే. విడుద‌లైన రోజు నుంచి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు ఆక‌ట్టుకుంటూ ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దూసుకెళ్తోంది. ఓవ‌ర్ సీస్‌లోనూ మంచి క‌లెక్ష‌న్స్‌ను సాధిస్తోంది. తాజాగా బాక్సాఫీస్ వ‌సూళ్ల ప‌రంగా డంకీ మ‌రో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. రూ.250 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను దాటేసిందీ చిత్రం.

2023లో ప‌ఠాన్‌, జ‌వాన్‌.. ఇప్పుడు డంకీ చిత్రాల‌తో షారూక్ న‌టించిన మూడు సినిమాలు వంద‌కోట్ల మార్క్ క్రాస్ చేయ‌టం విశేషం. ఆదివారం రోజునే ఈ చిత్రం రూ.29.25 కోట్ల నుంచి రూ.30.25 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌టంతో రూ.102.50 కోట్ల‌ను దాటేసింది. షారూక్ న‌టించిన చిత్రాల్లో డంకీ సినిమా వంద‌కోట్ల వ‌సూళ్ల‌ను సాధించ‌టంతో ఆయ‌న అభిమానులు హ్యాపీగా ఉన్నారు. ఇది ఆయ‌న కెరీర్‌లో వంద కోట్ల వ‌సూళ్ల‌ను దాటిన ప‌ద‌వ చిత్రం కావ‌టం విశేషం.

డంకీ చిత్రంలో టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రేక్షకులను మెప్పించారు. బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ సహా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు. ఏ జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అభిజీత్ జోషి, రాజ్ కుమార్ హిరాణి, క‌ణిక థిల్లాన్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌లుగా వ‌ర్క్ చేశారు.