వాంటెడ్ పండుగాడ్ టీజర్ విడుదల

Published On: July 11, 2022   |   Posted By:

వాంటెడ్ పండుగాడ్ టీజర్ విడుదల

చిన్న సినిమాగా వస్తున్న పెద్ద నవ్వుల చిత్రమిది వాంటెడ్ పండుగాడ్ టీజర్ విడుదల కార్యక్రమంలో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు

శ‌తాధిక చిత్ర ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో యునైటెడ్ కె ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సునీల్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, బ్ర‌హ్మానందం, వెన్నెల కిషోర్‌, స‌ప్త‌గిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా శ్రీధ‌ర్ సీపాన ద‌ర్శ‌క‌త్వంలో సాయిబాబ కోవెల మూడి, వెంక‌ట్ కోవెల మూడి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం వాంటెడ్ పండుగాడ్. పట్టుకుంటే కోటి ట్యాగ్ లైన్ ఈ చిత్రం ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో ఆదివారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు మాట్లాడుతూ చిన్న సినిమాలు ఆడటం కష్టమని అనుకుంటున్న తరుణంలో చిన్న సినిమాగా వస్తున్న పెద్ద నవ్వుల చిత్రమిది. పెద్ద సినిమాలకు ప్రమోషన్స్ అక్కర్లేదు మీరంతా కూడా సిన్సియర్‌గా ప్రమోట్ చేస్తేనే ఓపెనింగ్స్ వస్తాయి ఇందులో మీడియా సహకారం కూడా కావాలి ఓటీటీ భూతం ఉంది కాబట్టి జనాలను థియేటర్‌కు రప్పించడమే ఈ రోజుల్లో కష్టంగా మారింది. స్క్రిప్ట్ వింటున్నప్పుడే అందరూ ఎంజాయ్ చేశారు ఎలా తీస్తున్నారా? అని ఓ సారి మారెడుమిల్లికి వెళ్లి చూశాను. మూడు రోజులుందామని వెళ్లా కానీ పది రోజులుండిపోయాను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. పాటలు కూడా అద్భుతంగా తెరకెక్కించారు ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో పాటలు ఎక్కువగా చూడరు. కానీ ఈ సినిమా మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్. నల్లమల సినిమాలో ఏమున్నవే పిల్లా అనే పాట విన్నప్పుడే పీఆర్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యాను. కొత్త వాళ్లకు చాన్స్ ఇవ్వడమే నా ఇంట్రెస్ట్  ఆయన మంచి మ్యూజిక్ ఇచ్చారు టీం అంతా కష్టపడి చేశారు. అందరికీ థ్యాంక్స్ ఆగస్ట్ 19న ఈ సినిమా రాబోతోంది అని అన్నారు.

నిర్మాత జోసెఫ్ మాట్లాడుతూ రాఘవేంద్రరావు గారితో కలిసి సినిమాను నిర్మించే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. నాకు సహకరించిన సినిమా యూనిట్‌కు థ్యాంక్స్ సినిమా బాగా వచ్చింది. థియేటర్లో ఈ సినిమాను చూస్తే ఆ కిక్ వేరేలా ఉంటుంది ఆగస్ట్ 19న ఈ చిత్రం రాబోతోంది అందరూ థియేటర్లోనే చూడండి అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ పీఆర్ మాట్లాడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రాఘవేంద్రరావు గారికి థ్యాంక్స్. ఆయన పాటలు వింటూ పెరిగాం ఆయన చెబుతుంటే మేం సినిమా చేయడం ఆనందంగా ఉంది. సంగీతంపరంగా దర్శకుడు నాకు ఎన్నో సలహాలు ఇచ్చారు  దర్శకుడి విజన్ మా కష్టం రాఘవేంద్ర రావు గారి విజన్‌కు మేం అంతా కష్టపడి పని చేశామ అని అన్నారు.

సుధీర్ మాట్లాడుతూ రాఘవేంద్రరావు గారి సినిమాలు చూడటమే అదృష్టం. అలాంటిది ఆయన సినిమాల్లో నటించడం అంటే మా తల్లిదండ్రులో, మేమో ఏదో పూర్వజన్మలో చేసుకున్న సుకృతం. అందుకే మాకు ఈ అవకాశం వచ్చింది. ఆయన దర్శకత్వంలో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయన ఎవర్ యంగ్. మారెడుమిల్లిలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడా కూడా అలిసిపోలేదు. మాకంటే ముందుగా కొండలు ఎక్కేవారు, దిగేవారు మేం ఆయన వెనకాల ఉండేవాళ్లం ప్రజలందరూ ఈ సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నా అని అన్నారు.

నటుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పండుకు గాడ్ రాఘవేంద్ర రావు గారే ఆయను పుణ్యమా అని పండ్లన్నీ కూడా నాభి స్థలాన్ని తాకుతున్నాయి మాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ ఆగస్ట్ 19న ఈ చిత్రం రాబోతోంది అని అన్నారు.

నటుడు సప్తగిరి మాట్లాడుతూ ఆయన సినిమాలు చూస్తూ, పాటలు వింటూ పెరిగాం. ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో సినిమా చేయడం నాకు ఆనందంగా ఉంది ఆగస్ట్ 19న ఈ చిత్రం రాబోతోంది అని అన్నారు.

దీపిక పిల్లి మాట్లాడుతూ నాకు ఇది మొదటి సినిమా. ఆయన దర్శకత్వంలో పని చేయడం నాకు ఆనందంగా ఉంది ఈ సినిమాను ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశాం మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఆగస్ట్ 19న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి అని అన్నారు.