విజయ్ ఆంటోనీ లవ్ గురు సినిమా ప్రేక్షకులకు ఫ్యామిలీ టూర్ ఆఫర్

Published On: April 15, 2024   |   Posted By:

విజయ్ ఆంటోనీ లవ్ గురు సినిమా ప్రేక్షకులకు ఫ్యామిలీ టూర్ ఆఫర్

విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ లవ్ గురు ప్రేక్షకుల ఆదరణతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. ఈ సినిమా నుంచి ఓ ఎగ్జైటింగ్ ఆఫర్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. లవ్ గురు సినిమా చూసే ప్రేక్షకుల్లో విజేతలను ఫ్యామిలీతో సమ్మర్ హాలీడే టూర్ తీసుకెళ్తామని ప్రకటించారు. ఫస్ట్ ప్రైజ్ విన్నర్ కు మలేషియా, సెకండ్ ప్రైజ్ విజేతకు కాశ్మీర్, థర్డ్ ప్రైజ్ విన్నర్ కు ఊటీ హాలీడే ట్రిప్ ను తీసుకెళ్తామని లవ్ గురు టీమ్ తెలిపింది.

ఇవాళ్టి నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి రానుంది. లవ్ గురు సినిమా చూసిన ప్రేక్షకులు మీ పేరు, ఫోన్ నెంబర్, టికెట్ వివరాలు రాసి థియేటర్స్ దగ్గర ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేయాలి. ఆన్ లైన్ టికెట్ కొన్న ప్రేక్షకులు 9963466334 నెంబర్ కు మీ టికెట్ ఫొటోను వాట్సాప్ చేయాలి. ఈ సమ్మర్ హాలీడేస్ వెకేషన్ ను పూర్తి ఉచితంగా ఎంజాయ్ చేసే అవకాశం లవ్ గురు సినిమా టీమ్ కల్పిస్తోంది.

లవ్ గురు సినిమాను రంజాన్ పండుగ సందర్భంగా ఈ నెల 11న రిలీజ్ చేశారు. తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేసింది. లవ్ గురు సినిమా సక్సెస్ ఫుల్ గా థియేట్రికల్ రన్ కంటిన్యూ చేస్తోంది. ఈ సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ గా నటించగా..విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మించారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించారు.