విజ‌య్ దేవ‌ర‌కొండ‌ కొత్త చిత్రం ప్రకటన

Published On: December 19, 2019   |   Posted By:
విజ‌య్ దేవ‌ర‌కొండ‌ కొత్త చిత్రం ప్రకటన
 
ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ‌, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో చిత్రం
 
క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా `నిన్నుకోరి`, `మ‌జిలీ` వంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన‌ సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నుంది.
 
ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
డిసెంబ‌ర్ 18న దిల్‌రాజు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు.
 
2020 లో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. త్వ‌ర‌లోనే న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.