సిల్క్ శారీ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ లాంచ్

Published On: April 16, 2024   |   Posted By:

సిల్క్ శారీ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ లాంచ్

చాహత్ బ్యానర్ పై కమలేష్ కుమార్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సిల్క్ శారీ . ప్రముఖ హీరో గా వెబ్ సిరీస్ లో మంచి గుర్తింపు తెచ్చుకొన్న వాసుదేవ్ రావు హీరో గా రీవా చౌదరి మరియు ప్రీతీ గోస్వామి హీరోయిన్స్ గా టి . నాగేందర్ స్వీయ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రముఖ ప్రొడ్యూసర్ రాజకందుకూరి గారి చేతుల మీదుగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మేకర్స్ విడుదల చేశారు.

రాజ్ కందుకూరి గారు మాట్లాడుతూ, సినిమా టైటిల్ సిల్క్ శారీ అద్భుతంగా గ్రాండియర్‌ ఉందని , డైరెక్టర్ నుండి ఆశించిన అద్భుతమైన పనితనం కనిపించింది . టీజర్ మరియు ఫస్ట్ లుక్ చాల బాగున్నాయి అని .. ప్రొడ్యూసర్ గారికి మరియు డైరెక్టర్ గారికి పేరుతో పాటు మనీ కూడా రావాలి అని ఆశిస్తున్నాను . ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా ఈ సిల్క్ శారీ పై నమ్మకాన్ని చేశాడు.

హీరోగా నటిస్తున్న వాసుదేవ్ రావు మాట్లాడుతూ మా డైరెక్టర్ నాగేందర్ ఒక మంచి సబ్జెక్టు తో ఈ సినిమా ని తెరకెక్కించారు. ప్రొడ్యూసర్ గారు ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా మంచి చిత్రాన్ని నిర్మించారు . టైటిల్ రిలీజ్ చేసినందుకు రాజుకందుకూరి గారికి థాంక్స్ చెప్పుకుంటున్నాను .
బలమైన కథ, దానికి తగ్గట్టుగానే డ్రామా సన్నివేశాలను అద్భుతంగా రాసుకొని ఓ ఆసక్తికరమైన సంఘటన చుట్టూ సిల్క్ శారీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం కచ్చితంగ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

నటీనటులు :

వాసుదేవ్ రావు , రీవా చౌదరి , ప్రీతీ గోస్వామి , ఓంకార్ నాథ్ శ్రీశైలం , కోటేష్ మానవ తదితరులు.

సాంకేతిక వర్గం :

డైరెక్టర్ : టి . నాగేందర్
నిర్మాతలు : కమలేష్ కుమార్ , రాహుల్ అగర్వాల్ హరీష్ చండక్
బ్యానర్: చాహత్ ప్రొడక్షన్స్
సంగీత : వరికుప్పల యాదగిరి
కెమెరా : సనక రాజశేఖర్