సుందరం మాస్టర్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ 

Published On: February 20, 2024   |   Posted By:

సుందరం మాస్టర్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ 

‘సుందరం మాస్టర్’ సినిమా పెద్ద హిట్  కావాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సిద్దు జొన్నలగడ్డ

ఆర్ టీ టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్న చిత్రం ‘సుందరం మాస్టర్’. ఈ చిత్రంలో హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ ఈవెంట్‌లో సిద్దు జొన్నలగడ్డ బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు.

సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ..  ‘సుందరం మాస్టర్ ట్రైలర్ చూశాను. ఎంతో బాగుంది. హర్షని ఓ కమెడియన్ అని చెప్పడం నాకు నచ్చదు. అతను ఓ కామిక్ యాక్టర్. ఓ సపరేట్ కామెడీ టైమింగ్ ఉంటుంది. డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్‌కు ఈ తొలి ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇవ్వాలి. ఈ సినిమాను నిర్మించిన రవితేజ గారికి థాంక్స్. ఆయన ఎంత బిజీగా ఉన్నా ఇలా కొత్త వాళ్లని ఎంకరేజ్ చేసేందుకు సినిమాలు నిర్మిస్తున్నారు. కలర్ ఫోటో, మంత్ ఆఫ్ మధు, బేబీ ఇలా ఎప్పటికప్పుడు హర్ష తనకి తాను నటుడిగా నిరూపించుకుంటూ వస్తున్నారు. నాకు హర్ష పర్సనల్‌గా కూడా తెలుసు. ఆఫ్ స్క్రీన్‌లోనూ బాగా నవ్విస్తుంటాడు. ట్రైలర్‌లో చూసినట్టుగా హర్షని సీరియస్‌గా ఎప్పుడూ చూడలేదు. హీరోయిన్ దివ్య శ్రీపాదకు ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

హర్ష చెముడు మాట్లాడుతూ.. ‘పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఇచ్చిన సపోర్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేం. నాగ చైతన్య గారు పాటను, సాయి ధరమ్ తేజ్ గారు టీజర్‌ను లాంచ్ చేశారు. స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి గారు, రవితేజ గారు, సిద్దు జొన్నలగడ్డ గారు మాకు సపోర్ట్‌గా నిలిచారు. పదేళ్ల క్రితం ఆ ఆడియెన్స్ మధ్యలో ఉన్నాను. ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉన్నాను. మనం గట్టిగా నమ్మితే ఏదైనా సాధించగలం. ఫిబ్రవరి 23న మా చిత్రాన్ని థియేటర్లో చూసి ఎంకరేజ్ చేయండి’ అని అన్నారు.

సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. ‘సుందరం మాస్టర్ టీంలో పని చేసిన వారంతా పద్నాలుగేళ్లుగా కలిసే ఉన్నాం. మేం అంతా కలిసి ఈ సినిమాను తీశాం. లాక్డౌన్‌లో గోల్ డెన్‌ను ప్రారంభించాం. హర్ష వల్లే మేం అంతా ఇక్కడ ఇలా నిలబడ్డాం. మమ్మల్ని నమ్మి సినిమాను ఓకే చేశారు. మా కథను నమ్మి రవితేజ గారు ముందుకు వచ్చారు. అప్పుడు మా మీద మాకు నమ్మకం ఏర్పడింది. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. మా ఈవెంట్‌కు వచ్చి సపోర్ట్ చేసిన సిద్దు జొన్నలగడ్డ గారికి థాంక్స్’ని అన్నారు.

డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ మాట్లాడుతూ.. ‘మా సినిమా పోస్టర్లు, టీజర్,ట్రైలర్‌లు అందరికీ నచ్చాయి. ఈ సినిమాలోని ఇన్నోసెన్స్ వల్లే అందరికీ నచ్చింది. మా సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా ఎడిటర్ ఈ సినిమా కోసం చాలా వర్షన్స్ కట్ చేశారు. మా ఆర్ట్ డైరెక్టర్ సెట్స్‌ను ఎంతో అద్భుతంగా పని చేశారు. ఎంతో సహజంగా సెట్ వేశారు. ఏడాదిన్నరకు పైగా ప్రీ ప్రొడక్షన్ పనులు చేశాం. అంతా స్నేహితులమే కాబట్టి కలిసి పని చేశాం. మా డీఓపీ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. మా అందరిలోనూ శ్రీ చరణ్ పాకాల గారే సీనియర్. ఆయన చాలా సపోర్ట్ చేశారు. రవితేజ గారు మాకు అందించిన సపోర్ట్‌ను ఎప్పటికీ మరిచిపోలేం. సుధీర్ అన్న నాకు 8 ఏళ్లుగా తెలుసు. ఆయన దర్శకుడిగా ట్రై చేస్తూ ఉన్నా కూడా జూనియర్ అని చూడకుండా నా కథకు సపోర్ట్ ఇచ్చారు. మా అందరినీ బలంగా నమ్మి హర్ష మాకు సపోర్ట్ చేశారు. చిరంజీవి గారు, నాగ చైతన్య గారు, సిద్దు గారు మా సినిమాకు సపోర్ట్ చేశారంటే అది హర్ష గారి వల్లే. కలర్ ఫోటో సినిమా చూశాక హర్ష గురించి నాకు ఓ మీమ్ కనిపించింది. బంగారపు హుండీని చిల్లర కోసం వాడుతున్నార్రా అనే మీమ్ కనిపించింది. మేం మాత్రం బంగారమే వేశాం. దివ్య పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. ఆమె అద్భుతంగా నటించారు. ప్రకృతి అందరికీ ఒకేలా కనిపించదు. రైతుకు వర్షం అన్నం పెడితే.. రోడ్డు పక్కన బిజినెస్ చేసేవాళ్లకు ఫుడ్ లాక్కుంటుంది. అలా ఈ సినిమాను ఎన్నో కోణాల్లో చూపించాం. ఎంత పెద్ద హిట్ అవుతుందో తెలియదు కానీ.. మా అందరికీ గౌరవాన్ని తీసుకొస్తుంది. సినిమాను చూసిన వారందరికీ ఓ సంతృప్తిని మాత్రం ఇస్తుంది’ అని అన్నారు.

నిర్మాత ఎస్ కే ఎన్ మాట్లాడుతూ.. ‘హర్ష నాకు ఎప్పటి నుంచో తెలుసు. ట్రైలర్ చూస్తే యూనిక్ వైబ్ కనిపించింది. ఫిబ్రవరి 23న ఈ చిత్రం రాబోతోంది. సిద్దు ఎక్కడుంటే అక్కడ వైబ్రేషన్ ఉంటుంది. ఈ చిత్రంతో హర్ష అన్ని రకాల పాత్రలను పోషించగలడని నిరూపించుకోవాలి. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

సాయి రాజేష్ మాట్లాడుతూ.. ‘హర్ష అద్బుతమైన నటుడు. హీరోగా ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. శ్రీచరణ్ పాకాల సంగీతమంటే నాకు చాలా ఇష్టం. దర్శక నిర్మాతలకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

సందీప్ రాజ్ మాట్లాడుతూ.. ‘2013లో వైవా హర్ష షార్ట్ ఫిల్మ్ వచ్చాక నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. రంగు ముఖ్యం కాద కంటెంట్ ఉంటే జనాలు చూస్తారని అర్థమైంది. 2015లో సుహాస్‌తో కలర్ ఫోటో స్టార్ట్ చేసినప్పుడు హర్ష మాకు ఇన్‌స్పిరేషన్. ఇప్పుడు హీరోగా సుందరం మాస్టర్‌తో హర్ష ఎన్నో రూల్స్ బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాను. దివ్య కూడా ఫ్రెండ్ కారెక్టర్ల నుంచి హీరోయిన్‌గా మారింది. క్షణం నుంచి శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని ఇష్టపడుతూనే ఉన్నాను. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి’ అని అన్నారు.

శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ.. ‘సుందరం మాస్టర్ సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది. ఇంత వరకు అందరూ థ్రిల్లర్ సినిమాలకే పని చేస్తానని అనుకుంటూ ఉంటారు. కానీ నాకు ఇది చాలా కొత్తగా అనిపించింది. ఫుల్ ఎంజాయ్ చేస్తూ సినిమాకు పని చేశాను. హర్ష, నా కెరీర్ దాదాపు ఒకే టైంకు స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 23న మా సినిమాను చూడండి. ఓ జీవితాన్ని చూసినట్టుగా మీకు అనిపిస్తుంది’ అని అన్నారు.

రవికాంత్ పేరేపు మాట్లాడుతూ.. ‘హర్షతో టైం స్పెండ్ చేస్తే నవ్వుతూ ఉండాల్సిందే. అందుకే అందరూ అతనితో ఉండాలని అనుకుంటారు. హర్షకు ఈ చిత్రం ఇంకా మంచి పేరు తీసుకురావాలి’ అని అన్నారు.

రోషన్ కనకాల మాట్లాడుతూ.. ‘యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేసి హీరోగా ఎదగడం ఎంతో మందికి స్పూర్తిని ఇస్తుంది. హర్ష అద్భుతమైన నటుడు. ప్రేక్షకులు థియేటర్లో ఈ సినిమాను చూసి పెద్ద హిట్ చేయాలి’ అని అన్నారు.

ఎడిటర్ కార్తీక్ మాట్లాడుతూ.. ‘సుందరం మాస్టర్ పోస్టర్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేశాయి. ఈ సినిమాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి’ అని అన్నారు.

శరణ్ కొప్పిశెట్టి మాట్లాడుతూ.. ‘గాడ్స్ మస్ట్ బీ క్రేజీ సినిమాను తెలుగులో చూడబోతోన్నట్టుగా కనిపిస్తోంది. హర్ష అద్భుతంగా నటించారు. ఈ సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.

ప్రశాంత్ కుమార్ నిమ్మల మాట్లాడుతూ.. ‘కాలేజ్‌లో నాకు జూనియర్. నా కెమెరాతోనే హర్ష షార్ట్ ఫిల్మ్‌లోకి వచ్చాడు. అక్కడి నుంచి ఇక్కడి వరకు హర్ష ఎదిగిన తీరు అద్భుతంగా ఉంది. దర్శకుడు కళ్యాణ్ సంతోష్ టైమింగ్ బాగుంది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ తీసుకుని, అక్కడి వాళ్లతోనే షూట్ చేశారు. నిర్మాత సుధీర్ అనుకున్నది సాధించారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాల’ అని అన్నారు.

షణ్ముఖ్ జశ్వంత్ మాట్లాడుతూ.. ‘వైవా హర్ష హీరో అవుతున్నాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. హర్షకు ఆల్ ది బెస్ట్’ అన్నారు.

విజయ్ బిన్నీ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో ఓ పాటకు కొరియోగ్రఫీ చేశాను. హర్ష నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఈ మూవీ కాన్సెప్ట్, స్టోరీ నాకు తెలుసు. చాలా బాగుంటుంది. టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

డైరెక్టర్ ఆదిత్య మాట్లాడుతూ.. ‘యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ నుంచి సిల్వర్ స్క్రీన్ మీద హీరోగా హర్ష కనిపించబోతోన్నాడు. ఎంతో ఆనందంగా ఉంది. ట్రైలర్‌లో అందరూ సహజంగా కనిపించారు. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అన్నారు.

హరి గౌర మాట్లాడుతూ.. ‘సుందరం మాస్టర్ టీం వంద శాతం కష్టపడి పని చేశారని అర్థం అవుతోంది. సుధీర్ గారు నాకు రెండేళ్ల క్రితం ఓ కథ చెప్పారు. అప్పుడు దర్శకుడిగా చెబితే.. ఇప్పుడు నిర్మాతగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి’ అని అన్నారు.