సేవ్ ద టైగర్స్ 2 వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల

Published On: March 2, 2024   |   Posted By:

సేవ్ ద టైగర్స్ 2 వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల

సేవ్ ద టైగర్స్ 2 ట్రైలర్ రిలీజ్, ఈ నెల 15వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న సూపర్ హిట్ వెబ్ సిరీస్.

సూపర్ హిట్ వెబ్ సిరీస్ సేవ్ ద టైగర్స్ సీజన్ 2 వచ్చేస్తోంది. ఫస్ట్ సీజన్ సేవ్ ద టైగర్స్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకోవడంతో ఈ సెకండ్ సీజన్ పై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి. ఈ నెల 15వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో సేవ్ ద టైగర్స్ 2 స్ట్రీమింగ్ కాబోతోంది. మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం ఈ వెబ్ సిరీస్ ను క్రియేట్ చేశారు. అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం వహించారు. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, శ్రీకాంత్ అయ్యంగార్, గంగవ్వ, వేణు యెల్దండి, సీరత్ కపూర్, పావని గంగిరెడ్డి, దేవయాని, దర్శన బానిక్, హర్ష వర్థన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ట్రైలర్ ను ఇవాళ రిలీజ్ చేశారు.

సేవ్ ద టైగర్స్ 2 ట్రైలర్ రిలీజ్ సందర్భంగా షో క్రియేటర్ మహీ వి రాఘవ్ మాట్లాడుతూ  సేవ్ ద టైగర్స్ కు సెకండ్ సీజన్ అనౌన్స్ చేయడం థ్రిల్లింగ్ గా ‌ఫీలవుతున్నాం. సేవ్ ద టైగర్స్ ఫస్ట్ సీజన్ కు మించిన హ్యూమర్, సస్పెన్స్, ఫన్ ను సీజన్ 2లో మీకు అందించబోతున్నాం. అన్నారు.

సేవ్ ద టైగర్స్ 2 ట్రైలర్ ఎలా ఉందో చూస్తే..ట్రైలర్ బిగినింగ్ నుంచే ఫన్ రైడింగ్ గా ఉంటూ హిలేరియస్ గా సాగింది. వైవాహిక జీవితంలో విసిగిపోయిన భర్తలుగా ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ మరోసారి తమ ఫ్రస్టేషన్ తో నవ్వించారు. సంసారంలోని ఒత్తిడి నుంచి రిలాక్స్ కావడం కోసం ఈ ముగ్గురు చేసే ప్రయత్నాలు హ్యూమరస్ గా ఉన్నాయి. భార్యలు కూడా తమ భర్తలకు బుద్ధి చెప్పే పనులు చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ ..ఈ ముగ్గురు హంసలేఖ మిస్సింగ్ కేసులో ఇరుక్కోవడంతో కథలో సస్పెన్స్ క్రియేట్ అవుతుంది. ఈ హంసలేఖ ఎవరు, ఆమెతో వీళ్లు చేసిన ఫ్రెండ్షిప్ ఎక్కడికి దారితీసింది. ఆ కేసు నుంచి వీళ్లు ఎలా బయటపడ్డారు అనే సీన్స్ తో సేవ్ ద టైగర్స్ 2 ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా సాగింది.