హిడింబ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

ఐపీఎస్ ఆఫీసర్ ఆద్య (నందితా శ్వేతా) సిన్సియర్ ఆఫీసర్. ఐతే, హైదరాబాద్ లో వరుసగా అమ్మాయిలు అదృశ్యం అవుతుంటారు. పదహారు మిస్సింగ్ కేసులు నమోదు కావడంతో ఇన్వెస్టిగేషన్ కోసం ఐపీఎస్ ఆద్య (నందితా శ్వేతా) కేరళ నుంచి వస్తోంది. అప్పటి వరకు ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు అభయ్ (అశ్విన్ బాబు). అసలు ఆద్యకి అభయ్ కి మధ్య సంబంధం ఏమిటి ?, ఈ మిస్సింగ్ కేసుల విచారణలో అభయ్, ఆద్యకు తన సహకారాలు అందించడా ?, లేదా ?, ఇంతకీ ఈ మిస్సింగ్ కేసులకు – కేరళలో కొన్నేళ్ళ క్రితం జరిగిన మిస్సింగ్ కేసులకు మధ్య సంబంధం ఏమిటి ?, చివరగా అంతరించిపోయిన హిడింబ జాతిలో చివరి వ్యక్తి ఎవరు ? అనేది మిగిలిన కథ.

ఎవరెలా చేశారంటే :

నందితా శ్వేతా, అశ్విన్ బాబు పెర్ఫార్మన్స్ బాగున్నాయి

ప్లస్ పాయింట్స్ :

డిఫరెంట్ కాన్సెప్ట్ తో యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలో మెయిన్ సీక్వెన్స్ లో వచ్చే కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్ గా సాగుతూ ఆకట్టుకున్నాయి. ఇక అశ్విన్ బాబు, తన పాత్రలో అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా అశ్విన్ బాబు క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఇంట్రెస్టింగ్ సీన్స్ లో అశ్విన్ బాబు నటన చాలా బాగా ఆకట్టుకుంది. అలాగే క్లిష్టమైన కొన్ని హంటింగ్ సన్నివేశాల్లో కూడా అశ్విన్ బాబు నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

సినిమాలో కీలకమైన పాత్రలో నటించిన నందితా శ్వేత తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ లోనూ ఆమె పలికించిన హావభావాలు బాగున్నాయి. ఇక అశ్విన్ బాబు, నందితా శ్వేతకి మధ్య ఎమోషన్స్ కూడా బాగా ఎలివెట్ అయ్యాయి. అలాగే మరో ముఖ్య పాత్రలో నటించిన మకరంద్ దేశ్‌పాండే కూడా చాలా బాగా నటించాడు. శ్రీనివాసరెడ్డి పంచ్ లు పర్వాలేదు. సంజయ్ స్వరూప్, రాజీవ్ కనకాల, షిజ్జు లతో సహా ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు

మైనస్ పాయింట్స్ :

సినిమాలో మెయిన్ పాయింట్ అండ్ కొన్ని సీన్స్ ఆకట్టుకున్నా మధ్యలో కొన్ని సీన్స్ మాత్రం బోర్ గా సాగుతాయి. అలాగే క్యారెక్టర్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూస్ ను ఎలివేట్ చేస్తూ దర్శకుడు అనిల్ కన్నెగంటి అనుకున్న సీన్స్ లో కొన్ని చోట్ల బెటర్ గా ఉన్నా కొన్ని సీన్స్ మాత్రం ఆసక్తికరంగా సాగలేదు. అలాగే కొన్ని సన్నివేశాలు స్లోగా ఉండటం, మరియు కొన్ని సన్నివేశాల్లో ఇంట్రెస్ట్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.

పైగా సెకండ్ హాఫ్ లో మెయిన్ ట్రాక్ లో లాజిక్ మిస్ అవ్వడం వంటి అంశాలు బాగాలేదు. ఇలాంటి సస్పెన్స్ అండ్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ లో ట్రీట్మెంట్ ప్లే పై ఇంట్రెస్ట్ ను పెంచుతూ పోవాలి. అలాగే, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎఫెక్టివ్ గా వర్కౌట్ అవ్వాలి. కానీ ఈ సినిమాలో కొన్ని చోట్ల అవి మిస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమా స్క్రీన్ ప్లేను ఇంకా బలంగా రాసుకుని ఉండి ఉంటే సినిమా ఇంకా బెటర్ గా ఉండేది.

చూడచ్చా :

సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారు అయితే చూడచ్చు

సాంకేతిక విభాగం :

డైరెక్షన్, ఫోటోగ్రఫీ, పాటలు బాగున్నాయి

సినిమా వివరాలు :

సినిమా టైటిల్ : హిడింభ
బ్యానర్: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ : 20-07-2023
సెన్సార్ రేటింగ్: U/A
తారాగణం: అశ్విన్, నందిత శ్వేత
కథ – దర్శకత్వం : అనీల్ కన్నెగంటి
సంగీతం : వికాస్ బాదిసా
సినిమాటోగ్రఫీ: బి రాజశేఖర్
ఎడిటర్: MR వర్ణ
నిర్మాత: శ్రీధర్ గంగపట్నం
నైజాం డిస్ట్రిబ్యూటర్ : గ్లోబల్ సినిమాస్
రన్‌టైమ్: 136 నిమిషాలు

మూవీ రివ్యూ : రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్