18 పేజీస్ మూవీ ఫిబ్ర‌వ‌రి  2022 విడుద‌ల
 
మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ సమర్పణలో యంగ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, గార్జీయ‌స్ బ్యూటీ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ రాసిన క‌థ‌తో టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌కత్వంలో సిద్ధం అవుతున్న మూవీ 18 పేజీస్. 
 
100 ప‌ర్సెంట్ ల‌వ్, భ‌లే భ‌లే మ‌గాడివోయ్, పిల్లానువ్వ‌లేని జీవితం, గీత గోవిందం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల్ని నిర్మించిన జీఏ2పిక్చ‌ర్స్ – కుమారి 21 ఎఫ్ వంటి సూప‌ర్ హిట్ సినిమాను నిర్మించిన సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా 18 పేజీస్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 
 
స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ గా అంద‌రి మ‌న్న‌నులు అందుకుంటున్న బ‌న్నీ వాసు ఈ చిత్రానికి నిర్మిత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 
 
ఇప్ప‌టికే విడుద‌లైన 18 పేజీస్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లకు అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుత‌మైన ఆద‌ర‌ణ ల‌భించింది. 
 
ఈ నేప‌థ్యంలో 18 పేజీస్ విడుద‌ల తేదిని నిర్మాత బ‌న్నీ వాసు ప్ర‌క‌టించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ రేంజ్ లో ఫిబ్ర‌వ‌రి 18, 2022న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లుగా బ‌న్నీవాసు తెలిపారు. 
 
స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కుమారి 21 ఎఫ్ తో యూత్ ఫుల్ డైరెక్ట‌ర్ గుర్తింపు తెచ్చుకున్న ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్ 18 పేజీస్ ని కూడా వినూత్నంగా తెర‌కెక్కిస్తున్నారు. న‌వీన్ నూలీ ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్య‌వ‌హిర‌స్తున్నారు, ఏ వ‌సంత్ సినిమాటోగ్ర‌ఫి అందిస్తున్నారు, బాబు కో ప్రొడ్యూస‌ర్. ఈ చిత్రానికి సంబంధించిన‌ మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల అవనున్నాయి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో విడుద‌ల అవుతుంది.

తారాగ‌ణం

నిఖిల్ సిద్ధార్థ్, అనుప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌దిత‌ర‌లు

సాంకేతిక వ‌ర్గం

స‌మ‌ర్ప‌ణ – అల్లు అర‌వింద్
బ్యాన‌ర్లు – జీఏ2పిక్చ‌ర్స్, సుకుమార్ రైటింగ్స్
క‌థ – సుకుమార్
నిర్మాత – బ‌న్నీ వాసు
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం – ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్
మ్యూజిక్ – గోపీ సుంద‌ర్
కో ప్రొడ్యూస‌ర్ – బాబు
డిఓపి – ఏ వసంత్
ఎడిట‌ర్ – న‌వీన్ నూలీ
ఆర్ట్ – ర‌మ‌ణ వంక‌
రైట‌ర్ – శ్రీకాంత్ విస్సా
ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూస‌ర్ – శ‌ర‌ణ్ రాపర్తి, అశోక్ బి(సుకుమార్ రైటింగ్స్)