Reading Time: < 1 min

 కార్తికేయ3 చిత్రం త్వరలో ప్రారంభం

నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ3’ త్వరలో ప్రారంభం

హీరో నిఖిల్ సిద్ధార్థ్ తెలుగు, హిందీ భాషల్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అప్పటి నుంచి కార్తికేయ 3కి సంబంధించిన అప్‌డేట్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా నిఖిల్ కార్తికేయ 3ను అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు.  దర్శకుడు చందూ మొండేటి అడ్వెంచరస్ థ్రిల్లర్  మూడవ ఫ్రాంచైజీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌పై పని చేస్తున్నారు.  ఇది త్వరలో ప్రారంభం కానుంది.

కార్తికేయ 3  స్పాన్, స్కేల్ పరంగా చాలా బిగ్గర్ గా ఉండబోతోంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తారు.

ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘స్వయంభూ’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.