92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన హనుమాన్ మూవీ

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జా లేటెస్ట్ సెన్సేషన్ హనుమాన్ 92 సంవత్సరాల టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన మొదటి సినిమా అయిన ఈ ఫాంటసీ అడ్వెంచర్ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ మార్క్ దిశగా దూసుకుపోతోంది. ఓవర్సీస్‌లో 5 మిలియన్ల మార్క్‌ను అధిగమించింది.

ఈ చిత్రం పాన్ ఇండియాగా విడుదలైంది, హిందీతో సహా అన్ని భాషలలో అద్భుతమైన వసూళ్లను సాధించింది. హనుమాన్ నిజానికి నార్త్ రీజియన్‌లో స్ట్రెయిట్ హిందీ సినిమాలా అలరించింది. రిజనబుల్ టిక్కెట్ ధరలు ఉన్నప్పటికీ, హనుమాన్ అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన హనుమాన్ మూడు వారాల రన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకొని ఇప్పుడు నాలుగో వారంలోకి ఎంటరైయింది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం మరికొన్ని వారాల పాటు హనుమాన్ అద్భుతమైన రన్ కొనసాగుతుంది.