Reading Time: < 1 min

‌ఇదే మా క‌థ మార్చి 19 విడుద‌ల‌

యువ హీరో సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ ప్రధాన పాత్రలలో న‌టిస్తోన్నచిత్రం ‘ఇదే మా కథ’. రోడ్ జర్నీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్నఈ చిత్రానికి ‘రైడర్స్ స్టోరీ’ అనేది ఉపశీర్షిక. గురుపవన్ దర్శకుడు. ఎన్‌. సుబ్ర‌హ్మ‌ణ్యం ఆశీస్సుల‌తో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై జి.మహేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీమతి మనోరమ గురప్ప సమర్పిస్తున్నారు.

ఆద్యంతం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ‘ఇదే మా క‌థ’ చిత్రాన్ని మార్చి 19న ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర‌ల్లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు గురువారం నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించి రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో న‌లుగురు ప్ర‌ధాన పాత్ర‌ధారులు సుమంత్ అశ్విన్‌, శ్రీ‌కాంత్‌, భూమిక‌, తాన్యా హోప్ మంచు ప్ర‌దేశంలో బైక్ రైడింగ్ చేస్తూ క‌‌నిపిస్తున్నారు. “అడ్వంచ‌ర్ అవైట్స్” అనే క్యాప్ష‌న్‌తో సినిమాపై ఆస‌క్తిని మ‌రింత పెంచేలా ఈ పోస్ట‌ర్ ఉంది.

ఇటీవ‌ల రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా విడుద‌ల చేసిన ‘ఇదే మా క‌థ’ టీజ‌ర్‌కు అన్ని వైపుల నుంచీ ట్రెమండ‌స్ రెస్పాన్స్ ల‌భించింది. నిజానికి ఈ టీజ‌ర్‌తోటే సినిమాపై అంచ‌నాలు అమాంతం పెరిగాయి. విజువ‌ల్స్ అమేజింగ్‌గా ఉన్నాయ‌నీ, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా రూపొందింద‌నే అభిప్రాయం క‌లుగుతోంద‌నీ అంద‌రూ ప్ర‌శంసించారు.

నాలుగు ప్ర‌ధాన పాత్ర‌లు, ఆ పాత్ర‌ల్లో సుమంత్ అశ్విన్‌, శ్రీ‌కాంత్‌, భూమిక‌, తాన్యా హోప్ న‌ట‌న హైలైట్ అవుతాయ‌నీ, సి. రామ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ, సునీల్ క‌శ్య‌ప్ మ్యూజిక్ సినిమాకు బాగా ప్ల‌స్ అవుతాయ‌నీ చిత్ర బృందం తెలిపింది.

తారాగ‌ణం:

సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక‌, తాన్యా హోప్, సప్తగిరి, పృథ్వీ, సమీర్, రామ్ ప్ర‌సాద్‌, జోష్ ర‌వి, తివిక్రమ్ సాయి, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మ‌ధుమ‌ణి, సంధ్య జన‌క్.

సాంకేతిక బృందం:

స్టోరీ, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: గురు ప‌వ‌న్‌
ప్రొడ్యూస‌ర్: జి. మ‌హేష్‌
సినిమాటోగ్ర‌ఫీ: సి. రామ్ ప్ర‌సాద్‌
సంగీతం: సునీల్ క‌శ్య‌ప్‌
ఆర్ట్: జెకె మూర్తి
ఎడిటింగ్‌: జునైద్ సిద్దిఖి,
ఫైట్స్‌: పృథ్వీరాజ్‌