రోషన్ హీరో గా కొత్త చిత్రం ప్రకటన

Published On: March 14, 2022   |   Posted By:

రోషన్ హీరో గా కొత్త చిత్రం ప్రకటన

రోషన్ హీరో గా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ ప్రొడక్షన్ నెం 9 కొత్త చిత్రం

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లో యంగ్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ తో ప్రొడక్షన్ నెం 9 చిత్రాన్ని ప్రకటించింది. జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

రోషన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్ ఈ ఆసక్తికరమైన పోస్టర్ ద్వారా ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించారు. రోషన్ బ్యాక్ పోజ్ లో కనిపిస్తాడు. ఈ పోస్టర్ ప్రాజెక్ట్ పై అంచనాలను పెంచింది

ప్రదీప్ అద్వైతం విన్నింగ్ స్క్రిప్ట్ను రెడీ చేసాడు. త్వరలో  ప్రారంభం కానున్న ఈ చిత్రంలో రోషన్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇతర వివరాలు త్వరలో తెలియనున్నాయి.

తారాగణం: రోషన్

సాంకేతిక సిబ్బంది:
ప్రొడక్షన్ బ్యానర్స్: వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా
దర్శకుడు: ప్రదీప్ అద్వైతం