టిఎఫ్‌సిసి నంది అవార్డుల కార్యక్రమం ఆగస్టు 12
టిఎఫ్‌సిసి నంది అవార్డుల కార్యక్రమ ఏర్పాట్లను పరివేక్షిస్తూ దుబాయిలోని చీఫ్ గెస్టులను అహువనిస్తున్న ఆర్ కె గౌడ్
ప్రతిష్టాత్మక టిఎఫ్‌సిసి నంది అవార్డులు ఇరు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దుబాయ్‌లో అంగరంగ వైభగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే ఆగస్టు 12న దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో జరగబోతున్న ఈ అవార్డుల కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణగౌడ్ దుబాయ్ పర్యటనలో ఉన్నారు.
కనీవినీ ఎరుగని రీతిలో నంది అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆయన పడుతున్న శ్రమకి ఫలితంగా దుబాయ్ ప్రభుత్వం టిఎఫ్‌సిసి నంది అవార్డులను గుర్తించి అధికారిక లెసెన్స్‌ను జారీచేయడంతో పాటు 2 సంవత్సరాల దుబాయ్ వీసాను ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణగౌడ్‌కి అందించారు. దాదాపు 73 కంపెనీలకు ఛైర్మన్, రాయల్ ఫ్యామిలీ వ్యక్తి అయిన డా.బి.యు.అబ్దుల్లా టిఎఫ్‌సిసి నంది అవార్డుల ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
దుబాయ్‌లోని ఇండియన్ కౌన్సిలేట్ సభ్యులు కాళిముత్తు తదితరులు డా.ప్రతాని రామకృష్ణగౌడ్ కృషిని అభినందిస్తూ వారి సహాయసహకారాలు అందించడంతోపాటు, కార్యక్రమానికి అతిథిగా విచ్చేయనున్నారు.
ఇక డా.ప్రతాని రామకృష్ణగౌడ్ ఆధ్వర్యంలో టిఎఫ్‌సిసి నంది అవార్డులు పనులు వేగవంతంగా సాగుతున్నాయి, ముఖ్యంగా టీమ్ సభ్యుల నుండి, దనూబ్ ప్రాపర్టీస్ అధిపతి షాజన్, సీఈఓ నయీమ్, సీఏ రవికుమార్ సింగిరి, ఇ్రమాన్, టి-మా ప్రెసిడెంట్ మిస్ ఏషియా రష్మిఠాకూర్, ప్రకాష్‌నాగ్, సింగర్ రాకేష్, తులసికుమార్ దనూబ్ ప్రాపర్టీస్ మేనేజర్ కావ్య తదితరులు టిఎఫ్‌సిసి నంది అవార్డుల కార్యక్రమ ఏర్పాట్లకు ఎంతగానో సహకరిస్తున్నారు. దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో ఆగస్టు 12న జరగనున్న టిఎఫ్‌సిసి నంది అవార్డ్స్ కార్యక్రమానికి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ నటీనటులతో పాటు బాలీవుడ్ నుండి కూడా పలువురు సెలబ్రిటీలు హారజరుకానున్నారు, సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో కన్నులపండుగగా జరిగే ఈ కార్యక్రమంలో పలు కేటగరీల నంది అవార్డుల ప్రదానంతో పాటు ప్రముఖ నటీనటులతో స్పెషల్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు, వినోద కార్యక్రమాలతో అంగరంగవైభంగా జరగనున్నాయి.
ఇక టిఎఫ్‌సిసి నంది అవార్డుల కోసం ఇప్పటికే పలు కేటగిరిల్లో చాలా నామినేషన్స్ వచ్చాయి, చాలా మంది అప్లై చేసుకోవడం జరిగింది. ఈ అప్లికేషన్లను పరిశీలించి, 2019,20,21 సంవత్సరాలకు గాను తమ చిత్రాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నటీనటులను, 24 క్రాఫ్ట్స్ టెక్నీషియన్స్‌ను టిఎఫ్‌సిసి జ్యూరీ కమిటీ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. టిఎప్‌సిసి నంది అవార్డుల జ్యూరీ కమిటీలో మురళీమోహన్, సుమన్, టి.ప్రసన్నకుమార్, ఎస్.వి.కృష్ణారెడ్డి, రోజారమణి, శివాజీరాజా, బి.గోపాల్, విజయేంద్రప్రసాద్, మిట్టపల్లి సురేంద్ర, రేలంగి నరసింహారావు, ఎం.వి.రాధాకృష్ణ, సెంథిల్, జర్నలిస్ట్ ప్రభు, శేఖర్ మాస్టర్ తదిరులు ఉన్నారు.