GTA మూవీ అక్టోబర్ 6న విడుదల

Published On: September 22, 2023   |   Posted By:

GTA మూవీ అక్టోబర్ 6న విడుదల

యూత్ ను టార్గెట్ చేస్తూ వస్తున్న GTA అక్టోబర్ 6న విడుదల

GTA గేమ్ ను ఆధారంగా నిర్మించిన చిత్రం అక్టోబర్ 6న విడుదల

అశ్వత్థామ ప్రొడక్షన్స్ లో చైతన్య పసుపులేటి, హీనా రాయ్ హీరో హీరోయిన్లు గా అక్టోబర్ 6న థియేటర్స్ లో విడుదల కాబోతున్న సినిమా GTA. దీపక్ సిద్ధాంత్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.

మార్క్ కె రాబిన్ సంగీతం అందించిన ఈ సినిమాకు గ్యారీ బి.హెచ్ ఎడిటర్. కె.వి.ప్రసాద్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించారు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 6న థియేటర్స్ లో విడుదల కానుంది.

ఈ చిత్ర విడుదల పోస్టర్ ను రచయిత దర్శకుడు కృష్ణ చైతన్య విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న GTA సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను, 90కిడ్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా క్యాచీ టైటిల్ తో ఈ సినిమా రాబోతోందని తెలిపారు.

క్రైమ్ యాక్షన్ డ్రామా గా ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. GTA అనే గేమ్ ను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తీయడం జరిగిందని దర్శకుడు దీపక్ సిద్ధాంత్ తెలిపారు.

నటీనటులు :

చైతన్య పసుపులేటి, హీనా రాయ్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, కుమనన్ లోబో, రూప లక్ష్మీ, రాఖీ, చిత్రం శ్రీను తదితరులు.

సాంకేతిక నిపుణులు :

నిర్మాత: డాక్టర్ సుశీల
దర్శకత్వం: దీపక్ సిద్ధాంత్
సంగీతం: మార్క్ కె రాబిన్
ఎడిటర్: గ్యారీ బి.హెచ్
కామెరామెన్: కె.వి. ప్రసాద్