S-99 మూవీ టీజర్ విడుదల

S-99 రెండవ టీజర్ ను లాంచ్ చేసిన మురళీ మోహన్

టెంపుల్ మీడియా పతాకంపై సి. జగన్మోహన్ (మాయాబజార్ జగన్మోహన్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం S-99. ఇటీవలే ఫస్ట్ లుక్ ను ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్ రిలీజ్ చేసిన విషయం ప్రేక్షకులకు తెలిసిందే కాగా ఈ చిత్ర మొదటి టీజర్ ను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు విడుదల చేయగా, రెండవ టీజర్ ను నేడు మురళీమోహన్ విడుదల చేసారు.

ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ గతంలో మాయాబజార్ ను కలర్ చేసి ఈ సినిమా విజయాన్ని అందుకున్న జగన్మోహన్ గారు తాజాగా S-99 చిత్రానికి డైరెక్షన్ చేయడం జరిగింది.S-99 టీజర్ 2 విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా మాయాబజార్ లాగా మంచి విజయాన్ని అందుకుంటుందని ఆశిస్తున్నానుఅని అన్నారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జగన్మోహన్ మాట్లాడుతూ, S-99 రెండవ టీజర్ను మురళీమోహన్ గారు లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది.ఇంకా ఈ సినిమాకు సంబంధించిన నాలుగు టీజర్ లను సినీ ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ నెలలో రిలీజ్ చేసి, సినిమాను త్వరలోనే రిలీజ్ చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్వేతా వర్మ, ప్రొడ్యూసర్ యతీష్ పాల్గొన్నారు.

నటీనటులు :

జగన్మోహన్, శ్వేతా వర్మ

సాంకేతికవర్గం :

కెమెరా:వీ. శ్రీనివాస్
ఎడిటర్: సనాల్ అనిరుదన్
డైరెక్టర్: జగన్మోహన్
ప్రొడ్యూసర్స్: యతీష్ అండ్ నందిని