చదలవాడ శ్రీనివాసరావు ఆర్థిక సహాయం
 
నటీనటులకు నిర్మాత శ్రీ చదలవాడ శ్రీనివాసరావు ఆర్థిక సహాయం 
 
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో దేశం మొత్తం స్తంభించి పోయింది. చిత్ర పరిశ్రమలో పనులు కూడా ఆగిపోయాయి. దీనితో చాలా మంది నిర్మాతలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితులు తనవంతుగా నిర్మాతల మండలికి ఆపన్న హస్తం అందించేందుకు సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ముందుకు వచ్చారు.
 
2వ సారి తన ధార్మికతను చాటు కున్నారు. మొన్న ఆర్ధికంగా వెనుకబడిన నిర్మాతలకు 10,11,111 ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా లాక్ డౌన్ పొడిగించిన కారణంగా ఇప్పుడు మరో 10,11,111 అనౌన్స్ చేశారు.
 
ఈ మొత్తంలో 5.00.000 ఆర్ధికంగా వెనుకబడిన నటి నటులకు..జూనియర్ నటి నటులకు ఇవ్వడం జరుగుతుంది. మరియు 3,11,111.ఆర్థికం గా వెనుకబడిన నిర్మాతలకు ఈ డబ్బును ఇస్తారు. అలాగే 2,00,000 ప్రొడక్షన్ బాయ్స్ కి ఇవ్వనున్నారు. ఇప్పటికి 20,22,222 మొత్తంగా నిర్మాతల మండలి ద్వారా విడుదల చేస్తున్నారు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు