నాగబాబు రక్తదానం
 
మెగాబ్రదర్‌, మెగా ప్రొడ్యూసర్ నాగబాబు  ప్రపంచ రక్తదాతలు దినోత్సవం సందర్భంగా రక్తదానం
 
‘అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి…’ అంటూ అనాటి శ్రీ రాముడిని ఆరాధించిన ఓ క్ష్మణుడిలా…
మెగాస్టార్‌ చిరంజీవిగారి అడుగుజాడల్లో నడిచే మెగాబ్రదర్‌ నాగబాబుగారు. ఆయనకు అన్నగారి మాట వేదవాక్కు. ఆయన నడిచిన బాట సదా అనుసరణీయం. 
 
 
అన్నగారి సూచన శిరసుకెత్తుకున్న మెగా బ్రదర్‌ నాగబాబుగారు వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా మన చిరంజీవి  బ్లడ్‌ బ్యాంక్‌కి వచ్చి రక్తదానం చేసారు. 
 
 
కరోనా కల్లోల సమయంలో రక్తం దొరక్క బడుగు, బలహీన వర్గాలకు చెందిన పేద రోగులు ఇక్కట్లపాలు  కాకూడదనే సదుద్ధేశంతో రక్తదానం చేయాల్సిందిగా మెగాస్టార్‌ అభిమానులందరికీ పిలుపునివ్వడం,ఆ పిలుపుని తానూ స్వీకరించిన నాగబాబుగారు ఇవాళ రక్తదానం చేయడం ఎంతైనా ముదావహం. ఆయన నడిచిన బాటలోనే అభిమానుంతా నడుస్తుండడంతో  మెగాస్టార్‌కి మెగాభిమానులకు నాగబాబు గారు వారధిగా, సారధిగా కొనసాగుతున్నారు. ఇవాళ ఆయన అందించిన స్ఫూర్తి అభిమాన ప్రేక్షకులందరికీ ఓ ఉత్తేజం.