నిత్య అవసర సరుకులు పంపిణి చేసిన కథానాయిక ఆలేఖ్య ఏంజెల్
 
యూనియన్ కార్డ్ లేని జూనియర్ ఆర్టిస్ట్స్ కు నిత్య అవసర సరుకులు పంపిణి చేసిన కథానాయిక ఆలేఖ్య ఏంజెల్
 
కరోనా దెబ్బ ఎంత తీవ్రంగా ఉందో తెలిసిందే. ఈ వైరస్ ధాటికి ప్రపంచం చిగురుటాకులా వణికిపోతోంది. దీంతో వైరస్ అరికట్టడానికి ప్రపంచమంతా ఇప్పుడు కృషి చేస్తుంది. అందులో భాగంగా కథానాయిక ఆలేఖ్య ఏంజెల్ తన కుటుంభ సభ్యులతో కలిసి హ్యుమానిటీ హెల్పింగ్ హాండ్స్ సంస్థ ద్వారా నిత్యా అవసర సరుకులు పంపిణీ చేశారు. ఆలేఖ్య ఏంజెల్ తన ఫ్యామిలీ తో కలిసి గత కొన్ని రోజులుగా నిత్యావసర సరుకులు కొంతమంది సామాన్య ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. సోమవారం రోజు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్స్ (కార్డ్ లేని వారికి) 5 లక్షలు తన సొంత డబ్బు వ్యచించి నిత్య అవసర సరుకులు పంపిణీ చేశారు. 
 
ఈ సందర్బంగా కథానాయిక ఆలేఖ్య ఏంజెల్ మాట్లాడుతూ…
 
యూనియన్ కార్డ్ లేకుండా ఉన్న ఆర్టిస్ట్స్ ఈ కష్టకాలంలో పడుతున్న ఇబ్బందులను సోషల్ మీడియాలో చూసి ఈ సహాయం చేశాను, అలాగే కొంతమంది పిల్లలున్న మహిళలకు నగదు రూపంలో సహాయం చేశాను. కష్ట కాలంలో ఇలా కొంతమందికి సహాయం చెయ్యడం నాకు సంతోషాన్ని ఇచ్చింది, భవిసత్తులో ఇలాంటి కార్యక్రమాలు చెయ్యడానికి నేను ఎప్పుడూ ముందు ఉంటాను, ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ ముందుకు వచ్చి ఆర్టిస్ట్స్ కు సపోర్ట్ గా నిలుస్తే బాగుంటుందని ఆలేఖ్య ఏంజెల్ తెలిపారు.