హాయ్ నాన్న మూవీ టీజర్ అక్టోబర్ 15 విడుదల

Published On: October 12, 2023   |   Posted By:

హాయ్ నాన్న మూవీ టీజర్ అక్టోబర్ 15 విడుదల

నేచురల్ స్టార్ నాని, శౌర్యువ్, వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ హాయ్ నాన్న టీజర్ అక్టోబర్ 15న విడుదల

నేచురల్ స్టార్ నాని యూనిక్, హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ హాయ్ నాన్నా తో ప్రేక్షకులని అలరించబోతున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం గ్లింప్స్ కు దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన వచ్చింది. మొదటి రెండు పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. మేకర్స్ ఇప్పుడు ఈ సినిమా టీజర్‌కి సంబంధించిన అప్‌డేట్‌తో వచ్చారు.

హాయ్ నాన్నా టీజర్ అక్టోబర్ 15న విడుదల కానుంది. టీజర్ పోస్టర్ లీడ్ పెయిర్ -నాని, మృణాల్ ఠాకూర్ డ్రీమ్ కెమిస్ట్రీని చూపిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన కోర్ పాయింట్‌ను టీమ్ ఇంకా వెల్లడించకపోవడంతో, సినీ ప్రేక్షకులు టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీజర్ తో స్టొరీ లైన్ గురించి కొంత స్పష్టత ఇస్తుందని భావిస్తున్నారు.

శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుండగా, బేబీ కియారా ఖన్నా నాని కుమార్తెగా కనిపించనుంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించారు.

హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా, సాను జాన్ వరుగీస్ ISC సినిమాటోగ్రాఫర్. ప్రవీణ్ ఆంథోని ఎడిటర్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

హాయ్ నాన్నా చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 21న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

తారాగణం :

నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా

సాంకేతిక విభాగం :

దర్శకత్వం: శౌర్యువ్
నిర్మాతలు: మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల
బ్యానర్: వైర ఎంటర్‌టైన్‌మెంట్స్
డీవోపీ: సాను జాన్ వరుగుస్ ISC
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని