అయోధ్య రాముడికి మిషన్ సి 1000 మూవీ సినిమా పాట అంకితం

అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణం ప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో శ్రీరామచంద్ర భగవానుడికి అంకితం ఇస్తూ ఎస్ వి క్రియేషన్ పతాకంపై నిర్మించిన మిషన్ సి 1000 సినిమా యూనిట్ శ్రీరాముడి పాటను విడుదల చేశారు.

బిజేపి గోల్కొండ జిల్లా ప్రధాన కార్యదర్శి టి. ఉమామహేంద్ర ఆవిష్కరించారు. సంగీత దర్శకుడు శ్రీధర్ ఆత్రేయ సంగీతం అందించారు. రాముడి పాటను విజయ్ ప్రకాష్ ఆలపించారు. తేజేశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అన్ని పనులు పూర్తి చేసి మార్చి లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు తేజేశ్వర్ చెప్పారు.

నటీనటులు :

తేజేశ్వర్, ప్రజ్ణ నయన్, జయప్రకాష్, సుధ, కబీర్ సింగ్, సంజయ్ పాండే, అనీష్ కురువిల్లా, కాళిచరణ్ మహారాజ్.

సాంకేతిక వర్గం :

సినిమాటోగ్రఫీ : మహేందర్ యస్
సంగీతం : శ్రీధర్ ఆత్రేయ
ఎడిటర్ : మార్తాండ కే వెంకటేష్
నిర్మాతలు : కిరణ్మయి, విరాట్ , శౌర్య
కథ – కథనం – డైరెక్టర్ : తేజేశ్వర్