ఎస్.ఎల్.వి.సినిమాస్ బ్యానర్ ప్రొడక్షన్ నెం 8 అనౌన్స్‌మెంట్

Published On: January 20, 2024   |   Posted By:

ఎస్.ఎల్.వి.సినిమాస్ బ్యానర్‌ ప్రొడక్షన్ నెం 8 అనౌన్స్‌మెంట్

దీక్షిత్ శెట్టి‌, శశి ఓదెల హీరోలుగా ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఎల్.వి.సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.8 సినిమా రూపొందనుంది. కె.కె దర్శకత్వంలో సుధాకర్ చెెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శశి ఓదెల ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. డిఫరెంట్ స్టోరీతో 90వ దశకానికి చెందిన పీరియాడిక్ క్రైమ్ డ్రామాగా సినిమా తెరకెక్కనుండటం విశేషం.

పూర్ణచంద్ర తేజస్వి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నగేష్ బన్నెల్ సినిమాటోగ్రాఫర్‌గా, కార్తీక శ్రీనివాస్.ఆర్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సహా మిగతా వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.

నటీనటులు:

దీక్షిత్ శెట్టి, శశి ఓదెల తదితరులు

సాంకేతిక వర్గం:

బ్యానర్ : ఎస్.ఎల్.వి.సినిమాస్
నిర్మాత : సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం : కె.కె
సినిమాటోగ్రఫీ : నగేష్ బన్నెల్
సంగీతం : పూర్ణాచంద్ర తేజస్వి
ఎడిటర్ : కార్తీక శ్రీనివాస్