కన్నప్ప చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల

Published On: November 23, 2023   |   Posted By:

కన్నప్ప చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల

విష్ణు మంచు బర్త్ డే సందర్భంగా ‘కన్నప్ప’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వదిలిన చిత్రయూనిట్
మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, ప్రభాస్, శరత్ కుమార్ వంటి భారీ తారాగణంతో ప్రారంభమైన కన్పప్ప సినిమాలో విష్ణు మంచు టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఈ కన్నప్ప ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో బజ్ క్రియేట్ చేసింది. విష్ణు మంచు బర్త్ డే (నవంబర్ 23) సందర్భంగా కన్నప్ప నుంచి పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సినిమా మీద భారీ అంచనాలను నెలకొల్పేలా ఉంది.
భారీ శివలింగం.. విల్లుని ఎక్కు పెట్టిన కన్నప్ప లుక్.. ఆ బాణాలు దూసుకెళ్తున్న తీరు.. చుట్టూ ప్రకృతి, దట్టమైన అడవి ఇలా అన్నీ చూస్తుంటే.. తెరపైకి ఓ అద్భుతం రాబోతున్నట్టుగా అనిపిస్తోంది. సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వడానికి కన్నప్ప ఎంత కష్టపడుతోందో ఈ పోస్టర్ చూస్తుంటేనే అర్థం అవుతోంది. ఈ పోస్టర్‌తో సినిమా స్థాయిని అందరికీ చూపించేసింది కన్నప్ప యూనిట్.
ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను న్యూజిలాండ్ పరిసర ప్రాంతాల్లోనే 80 శాతం షూటింగ్‌ పార్ట్‌ను కంప్లీట్ చేయనున్నారు. న్యూజిలాండ్‌లో ఇంత వరకు తెరపై చూపించని విజువల్స్‌ను అద్భుతంగా చూపించబోతున్నారు. కన్నప్పను ఓ విజువల్ వండర్‌గా.. తెరపై ఎప్పటికీ చెరిగిపోని ఓ దృశ్యకావ్యంలా ఉండేలా నిర్మిస్తున్నారు.  హాలీవుడ్ సినిమాటోగ్రఫర్ షెల్డన్ చౌ ఈ సినిమాను ఉన్నతమైన స్థాయిలో చూపించబోతున్నారు.
‘కన్నప్ప సినిమా కోసం మా ప్రాణాన్ని పనంగా పెడుతున్నాం. మహా శివుడి ప్రియ భక్తుడైన కన్నప్పను తెరపైకి తీసుకొచ్చేందుకు మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. కన్నప్ప సినిమాను ఓ దృశ్యకావ్యంలా.. మునుపెన్నడూ చూడని ఓ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా రూపొందిస్తున్నాం’ అని విష్ణు మంచు అన్నారు.
కన్పప్ప చిత్రంలోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ ఇండియన్ స్క్రీన్స్ మీద ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసేలా ఉండబోతున్నాయి. ఈ సినిమాలో అద్భుతమైన విజువల్స్‌తో పాటు, నటీనటుల ఎమోషనల్, విష్ణు మంచు పర్ఫామెన్స్ కూడా అందరికీ గుర్తుండిపోతాయి