కలశ మూవీ టిజర్‌ రిలీజ్‌

Published On: November 24, 2023   |   Posted By:

కలశ మూవీ టిజర్‌ రిలీజ్‌

గ్రాండ్‌ గా “కలశ” మూవీ టిజర్‌ రిలీజ్‌
చంద్రజ ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై బిగ్‌బాస్‌ ఫేమ్‌ భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కలశ’. కొండ రాంబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డాక్టర్‌ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మించారు. షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సందర్భంగా
ఈ సినిమా టీజర్‌ ఆవిష్కరణ వేడుక ప్రసాద్‌ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ‘కలశ’ టీజర్‌ను భీమ్లా నాయక్‌ డైరెక్టర్‌ సాగర్‌ చంద్ర ఆవిష్కరించారు. బ్యానర్‌ లోగోను వి.ఎన్‌. ఆదిత్య లాంచ్‌ చేయగా, టైటిల్‌ లోగోను యాట సత్యన్నారాయణ, మోషన్‌పోస్టర్‌ను వీరశంకర్‌లు లాంచ్‌ చేశారు.
అనంతరం సాంగ్‌ను వి.ఎన్‌. ఆదిత్య, వీరశంకర్‌, సాగర్‌చంద్ర, యాట సత్యన్నారాయణ ఉమ్మడిగా విడుదల లాంచ్‌ చేశారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కొండా రాంబాబు మాట్లాడుతూ…
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు, యూనిట్‌ సభ్యులకు, ఈ చిత్రం ప్రారంభం కావటానికి కారకులైన మిత్రులకు నా ధన్యవాదాలు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత చంద్రజ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. మంచి టెక్నీషియన్స్‌ను ఇచ్చారు. అందరూ ఇది తమ స్వంత చిత్రం అనుకుని పగలు, రేయి కష్టపడ్డారు. ఇక హీరో అనురాగ్‌, భానుశ్రీ, సోనాక్షి వర్మ, రోషిణిలు అద్భుతంగా నటించారు. మా అందరినీ వెనుక ఉండి నడిపించిన స్వామి గారి గురించి, మేడమ్‌ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ‘కలశ’ అనే టైటిల్‌ ఈ సినిమాలోని క్యారెక్టర్‌. కలశం ఎంత పవిత్రంగా ఉంటుందో.. ఈ క్యారెక్టర్‌ కూడా అంతే పవిత్రంగా ఉంటుంది. అందుకే కలశం నుంచి ‘కలశ’ను తీసుకోవడం జరిగింది. బ్రెయిన్‌కి, హార్ట్‌కి లింక్‌ చేస్తూ రాసుకున్న సినిమా ఇది. అందరినీ ఆకట్టుకునే మంచి కథ, కథనం ఉన్న సినిమా అన్నారు.
నిర్మాత రాజేశ్వరి చంద్రజ మాట్లాడుతూ…
మా తొలి చిత్రం తొలి ప్రమోషన్‌లో నలుగురు గొప్ప దర్శకులు పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. వారికి పేరు పేరునా ధన్యవాదాలు. నేను ఇప్పటికీ రోజుకు 16 గంటలు పనిచేస్తూ ఉంటాను. రాంబాబు గారు కూడా చాలా హార్డ్‌ వర్కర్‌. ఆయన చెప్పిన కథ నన్ను చాలా ఆకట్టుకుంది. ఈ కథకు కావాల్సిన కమర్షియల్‌ హంగులను అన్నింటినీ కూర్చి ఈ ‘కలశ’ను తెరకెక్కించాము. కీర్తి శేషులైన మా నాన్నగారి ఆశీస్సులు మా యూనిట్‌కు ఎప్పుడూ అండగా ఉంటాయి. టెక్నీషియన్స్‌, ఆర్టిస్ట్‌లు అందరూ చక్కగా కో`ఆపరేట్‌ చేశారు. రాంబాబు గారికి పూర్తి ఫ్రీడం ఇస్తూనే.. ఎక్కడా అశ్లీలత లేకుండా చూడండి అని రిక్వెస్ట్‌ చేశాను. సెన్సార్‌ వారు కూడా కట్స్‌ లేకుండా సర్టిఫికెట్‌ ఇవ్వడం మా తొలి విజయంగా భావిస్తున్నాను. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాను అన్నారు.
సంగీత దర్శకుడు విజయ్‌ కూరాకుల మాట్లాడుతూ..
డైరెక్టర్‌ రాంబాబుగారు ఈ సినిమా విషయంలో చాలా డీప్‌గా ఇన్వ్‌వాల్వ్‌ అయ్యారు. ముఖ్యంగా సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ల విషయంలో మరింతగా కేర్‌ తీసుకున్నారు. తప్పకుండా మంచి హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది. సంగీత దర్శకుడిగా నాకు, మా యూనిట్‌ మొత్తానికి మంచి పేరు వస్తుంది అన్నారు.
దర్శకులు వి.ఎన్‌. ఆదిత్య మాట్లాడుతూ…
దర్శక, నిర్మాతలు ఈ సినిమా విషయంలో చాలా రీసెర్చ్‌ అండ్‌ నాలెడ్జ్‌తో ముందుకు వెళ్లినట్టు టీజర్‌ చూస్తే తెలుస్తోంది. కలశం అనేది లక్ష్మీదేవికి ప్రతీక. ఆ కలశం కలిసి వచ్చేలా ‘కలశ’ పేరు పెట్టుకున్న ఈ చిత్రం తప్పకుండా లక్ష్మీకటాక్షం పొందుతుందని ఆశిస్తున్నా. మంచి సేలబుల్‌ జోనర్‌తో ముందుకు రావడం దర్శక, నిర్మాతల ముందు చూపుకు అద్దం పడుతోంది. ఆల్‌ ది బెస్ట్‌ టు యూనిట్‌ అన్నారు.
దర్శకులు వీరశంకర్‌ మాట్లాడుతూ…
సినిమా చూడటం అనేది సరదా… సినిమా తీయడం అనేది సీరియస్‌నెస్‌. చాలా మంది కొత్త నిర్మాతలు వాళ్లు సినిమా చూసినట్టే.. సినిమా తీస్తారు. కానీ ప్రొఫెషనల్‌గా చేయరు. కానీ ఈ సినిమా విషయంలో మంచి ప్రొఫెషనలిజం కనిపిస్తోంది. నిర్మాత చంద్రజ గారు కళాకారిణి కావడం, ఆమె భర్త బిజినెస్‌ మ్యాన్‌ కావడంతో సినిమా మంచి ట్రాక్‌లో వెళ్లింది. మంచి టెక్నీషియన్స్‌ను ఎంచుకోవడంలోనే దర్శకుడు రాంబాబు సక్సెస్‌ అయ్యారు. యూనిట్‌ అందరికీ నా ఆల్‌ ది బెస్ట్‌ అన్నారు.
దర్శకులు సాగర్‌ చంద్ర మాట్లాడుతూ…
టీజర్‌ చాలా బాగుంది. మంచి ఎమోషన్‌, యాక్షన్‌ ఉంది. వీరశంకర్‌ గారు ఈ సినిమా ఆల్రెడీ చూశారు. బాగుందని చెప్పారు. ఆయన జడ్జిమెంట్‌ అంటే అందరికీ గురి. కాబట్టి ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది అన్నారు. ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ అందరూ మంచి ఎఫర్ట్స్‌ పెట్టారు. అందరికీ అల్‌ ది బెస్ట్‌ అన్నారు.
దర్శకులు యాట సత్యనారాయణ మాట్లాడుతూ…
రాంబాబు మంచి టెక్నీషియన్‌. ఆయనకు మంచి నిర్మాతలు దొరకడంతో చక్కని చిత్రాన్ని నిర్మించారు. ఆ విషయం ట్రైలర్‌ చూస్తుంటే తెలుస్తోంది. విజయ్‌ కురాకుల అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్‌ ఇచ్చారు. అందరికీ ఆల్‌ ది బెస్ట్‌ అన్నారు.
ఈ కార్యక్రమంలో తదితర చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్‌, రోషిణి కామిశెట్టి, జీవా, సమీర్‌, రవివర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి  సినిమాటోగ్రఫీ: వెంకట్‌ గంగధారి, సంగీతం: విజయ్‌ కురాకుల, ఎడిటర్‌: జునైద్‌ సిద్దిఖీ, లిరిక్స్‌: సాగర్‌ నారాయణ, నిర్మాత: డాక్టర్‌ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి, దర్శకత్వం: కొండ రాంబాబు.