గామి చిత్రం చాందిని చౌదరి ఫస్ట్ లుక్ విడుదల

Published On: February 22, 2024   |   Posted By:

గామి చిత్రం చాందిని చౌదరి ఫస్ట్ లుక్ విడుదల

 

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, విద్యాధర్ కాగిత, కార్తీక్ శబరీష్, వి సెల్యులాయిడ్ ‘గామి’ నుంచి జాహ్నవిగా వెరీ టాలెంటెడ్ చాందిని చౌదరి ఫస్ట్ లుక్ విడుదల
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్ అడ్వెంచర్ డ్రామా ‘గామి’ థియేట్రికల్ ట్రైలర్ మరో వారంలో ఫిబ్రవరి 29న విడుదల కానుంది. వెరీ టాలెంటెడ్ చాందినీ చౌదరి ఈ సినిమాలో కథానాయిక.

ఈరోజు పోస్టర్ ద్వారా చాందిని పాత్రను జాహ్నవిగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. చాందిని కళ్లజోడుతో పెక్యులర్ గా వున్న ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆమె వీధుల్లో నడుస్తూ కనిపించింది. చాందినితో పాటు విశ్వక్ చేసిన సాహస యాత్రను సినిమాలో అద్భుతంగా చూపించనున్నారు.

మానవ స్పర్శను అనుభవించలేని అరుదైన వ్యాధితో బాధపడే అఘోరా పాత్రలో విశ్వక్ సేన్ నటించారు. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రానికి క్రౌడ్ ఫండ్ చేశారు. వి సెల్యులాయిడ్ సమర్పిస్తుంది.

హారిక పెడాడ, మహ్మద్ సమద్ ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ విశ్వనాథ్ రెడ్డి, రాంపీ నందిగాం అందిస్తున్నారు. నరేష్ కుమారన్ మ్యూజిక్. విద్యాధర్ కాగిత, ప్రత్యూష్ వత్యం స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు.

గామి మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తారాగణం:- విశ్వక్ సేన్, చాందిని చౌదరి, ఎంజీ అభినయ, హారిక పెడదా, మహ్మద్ సమద్
సాంకేతిక విభాగం:-
దర్శకత్వం:- విద్యాధర్ కాగిత
నిర్మాత:- కార్తీక్ శబరీష్
సమర్పణ:- వి సెల్యులాయిడ్
స్క్రీన్ ప్లే:- విద్యాధర్ కాగిత, ప్రత్యూష్ వత్యం
ప్రొడక్షన్ డిజైన్:- ప్రవల్య దుడ్డుపూడి
ఎడిటర్:- రాఘవేంద్ర తిరున్
సంగీతం:- నరేష్ కుమారన్
డీవోపీ:- విశ్వనాథ్ రెడ్డి
కో-డిఓపి:- రాంపీ నందిగాం
Vfx సూపర్‌వైజర్:- సునీల్ రాజు చింత
కాస్ట్యూమ్ డిజైన్:- అనూష పుంజాల, రేఖ బొగ్గరపు
కలరిస్ట్:- విష్ణు వర్ధన్ కె
సౌండ్ డిజైన్: – సింక్ సినిమాస్
యాక్షన్ కొరియోగ్రాఫర్:- వింగ్ చున్ అంజి
పాటలు:- నరేష్ కుమారన్, స్వీకర్ అగస్తి
సాహిత్యం:- సనాపతి భరద్వాజ పాత్రుడు, శ్రీ మణి