చారి 111 చిత్రం థీమ్ సాంగ్‌ విడుదల

Published On: February 21, 2024   |   Posted By:

చారి 111 చిత్రం థీమ్ సాంగ్‌ విడుదల

చక చక మొదలిక… సాహసాల యాత్ర ఆగదిక… ఇది ఆపరేషన్ రుద్రనేత్ర’ అని ‘చారి 111’ టీమ్ అంటోంది. స్టైలిష్‌గా పిక్చరైజ్ చేసిన థీమ్ సాంగ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్‌లో ఆ సాంగ్ వైరల్ అవుతోంది.
‘వెన్నెల కిశోర్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘చారి 111’. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు.
ఇందులో సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. మురళీ శర్మ ప్రధాన పాత్రధారి.
మార్చి 1న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ‘చారి 111’ థీమ్ సాంగ్ విడుదల చేశారు.
”ఒక కన్ను భూగోళం
ఒక కన్ను ఆకాశం
విశ్వాన్ని వెతికేద్దాం… పదా!
శిఖరాలు తొలిచేద్దాం…
సంద్రాలు వడపోద్దాం…
కాలాన్ని కనిపెడదాం… దా!
నిశ్శబ్దం చేధించుదాం
నిత్య యుద్ధం సాగించుదాం…
ఖాళీలు అన్నీ పూరించుదాం…
ఓ… చక చక మొదలిక…
సాహసాల యాత్ర ఆగదిక…
ఆపరేషన్ రుద్రనేత్ర”
అంటూ సాగిన ఈ పాటను సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి రాయగా ‘జవాన్’ ఫేమ్ సంజీత భట్టాచార్య ఆలపించారు. సైమన్ కె కింగ్ మంచి స్టైలిష్‌ ట్యూన్ అందించారు. స్టైలిష్‌గా డిజైన్ చేసిన లిరికల్ వీడియో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. భారీ సినిమాలకు తీసిపోని రీతిలో సినిమాను తెరకెక్కించారని సాంగ్ చూస్తే తెలుస్తోంది. ప్రొడక్షన్ వేల్యూస్ ఉన్నత స్థాయిలో ఉన్నాయని అర్థం అవుతోంది.
‘చారి 111’ థీమ్ సాంగ్ విడుదలైన సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ”మా సినిమాలో ఒక్కటే సాంగ్ ఉంది. స్టార్టింగ్ టైటిల్స్‌లో వస్తుంది. ఈ పాటను నేపథ్య సంగీతంలో ఉపయోగించాం. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ ఫెంటాస్టిక్ రెస్పాన్స్ అందుకుంది. వెన్నెల కిశోర్ గారిని ఇంతకు ముందెప్పుడూ ఇలా చూడలేదని ప్రేక్షకులు చెబుతున్నారు. ఆయన లుక్స్, స్టైలిష్ స్పైగా చేసిన కామెడీ సూపరని చెబుతున్నారు. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది” అని చెప్పారు.
ఆదిత్య మ్యూజిక్ ద్వారా ‘చారి 111’ థీమ్ సాంగ్ విడుదలైంది.
‘వెన్నెల’ కిశోర్, సంయుక్తా విశ్వనాథన్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రవీంద్రన్, పావని రెడ్డి, ‘తాగుబోతు’ రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఎడిటింగ్ : రిచర్డ్ కెవిన్ ఎ, స్టంట్స్ : కరుణాకర్, ప్రొడక్షన్ డిజైన్ : అక్షత బి హొసూరు, పీఆర్వో : పులగం చిన్నారాయణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బాలు కొమిరి, సాహిత్యం : సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి, సినిమాటోగ్రఫీ : కషిష్ గ్రోవర్, సంగీతం : సైమన్ కె కింగ్, నిర్మాణ సంస్థ : బర్కత్ స్టూడియోస్, నిర్మాత : అదితి సోనీ, రచన, దర్శకత్వం : టీజీ కీర్తీ కుమార్.