చైనా పీస్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేసిన హీరో నిఖిల్ సిద్ధార్థ

China Piece Movie Poster

China Piece Movie Poster

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్‌ ప్రధాన పాత్రలలో అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం చైనా పీస్. రిపబ్లిక్ డే సందర్భంగా పాన్ ఇండియా స్టార్ హీరో నిఖిల్ సిద్ధార్థ ఈ చిత్రం ఫస్ట్ లుక్, హై కాన్సెప్ట్ పోస్టర్‌ను లాంచ్ చేశారు.

లిప్‌స్టిక్, యుఎస్ బీ డ్రైవ్ ఇమేజ్ కాంబినేషన్ ని మిక్స్ చేస్తూ ఆసక్తికరంగా చూపిస్తూ ఒక మిసైల్ ని పోలివున్న ఈ  పోస్టర్‌ చాలా క్యురియాసిటీని పెంచింది.  దేశభక్తి, భారతదేశం-చైనా సంబంధాల ఇతివృత్తంతో ఈ కథ ఉండబోతుందని పోస్టర్ సూచిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఒక డిఫరెంట్ సినిమాటిక్ జర్నీని ప్రామిస్ చేస్తోంది.

మూన్ లైట్ డ్రీమ్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో హర్షిత, శ్రీషా నూలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. సురేష్ రగుతు  డివోపీ కాగ, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్.

తారాగణం: నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్,  హర్షిత, శ్రీషా నూలు,  శ్రీకాంత్ అయ్యంగార్, కమల్ కామరాజు, తులసి, రంగస్థలం మహేష్, వంశీ నెక్కంటి, వడ్లమాని శ్రీనివాస్, దీక్షా పంత్, వినోద్ సాగర్ తదితరులు.

సాంకేతిక సిబ్బంది:

దర్శకత్వం: అక్కి విశ్వనాధ రెడ్డి

బ్యానర్: మూన్ లైట్ డ్రీమ్స్

సినిమాటోగ్రాఫర్: సురేష్ రగుతు

ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్