జోరుగా హుషారుగా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్

గ్రాండ్ గా ‘జోరుగా హుషారుగా’ ప్రీ రిలీజ్ ఈవెంట్
‘బేబి’ చిత్రంతో న‌టుడిగా అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్న యూత్‌ఫుల్ క‌థానాయ‌కుడు విరాజ్ అశ్విన్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘జోరుగా హుషారుగా’. పూజిత పొన్నాడ క‌థానాయిక‌. అను ప్ర‌సాద్ ద‌ర్శ‌కుడు. శిఖ‌ర అండ్ అక్ష‌ర ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ ప‌తాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ అండ్ ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబ‌రు 15న విడుద‌ల కాబోతోంది. సోమవారం సాయంత్రం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.
ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు మల్లిడి వశిష్ట మాట్లాడుతూ.. “కొత్త డైరెక్టర్ ను  నమ్మి సినిమా ఇచ్చిన నిర్మాత నిరీష్ గారికి థాంక్స్. ఈ ఏడాది బేబి చిత్రంతో కల్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన విరాజ్.. మరో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు. విరాజ్ కి తెలుగు హీరోయిన్స్ బాగా కలిసి వస్తున్నారు. అలాగే కంటిన్యూ చేస్తే మరింత బాగుంటుంది. బెక్కం వేణుగోపాల్ గారిని అందరూ సేవియర్  అంటున్నారు కానీ ఆయన వారియర్. కొత్త దర్శకులను కొత్త కథలను అలాగే చిన్న సినిమాలను ఆయన బాగా ఎంకరేజ్ చేస్తారు. అందుకే ఆయన సూపర్ హిట్ ప్రొడ్యూసర్. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ టీం అందరికీ ఆల్ ద బెస్ట్” అని చెప్పారు.
మరో గెస్ట్ గా హాజరైన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ సినిమా సక్సెస్ అవ్వాలని విష్ చేశారు.
బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. “చిన్న సినిమాలకు సపోర్ట్ చేస్తూనే నేను కూడా ఎదుగుతూ వచ్చాను. నిరీష్ ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్. తను మరిన్ని సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నా. బేబీ సినిమాతో సర్ప్రైజ్ చేసి.. బెస్ట్ పెరఫార్మర్ గా పేరు తెచ్చుకున్న విరాజ్ ఈ చిత్రంతో మరో సక్సెస్ ను అందుకుంటాడు. ఈ చిత్రానికి మంచి టీం దొరికింది. ప్రతి ఒక్కరూ ది బెస్ట్ ఇచ్చారు. ఇందులోని ఫ్యామిలీ డ్రామా బాగా పండింది.  ముఖ్యంగా తండ్రి కొడుకులు మధ్య వచ్చే సీన్స్ అందర్నీ ఆకట్టుకుంటాయి” అని చెప్పారు.
కార్యక్రమానికి హాజరైన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్  మూవీ టీం కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
విరాజ్ మాట్లాడుతూ..”ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ ఎంజాయ్ చేస్తూ రిలేట్ చేసుకునే సినిమా ఇది. ఈ చిత్రంలో చేనేత కార్మికుల గురించి ఒక స్పెషల్ సాంగ్ చేశాం. షూటింగ్ లో భాగంగా వాళ్ళ లైఫ్ స్టైల్ ను చాలా దగ్గరగా చూశాను. చేనేత కార్మికుల కుటుంబం నుంచి వచ్చిన సంతోష్ గా నేను ఇందులో కనిపిస్తాను. నా క్యారెక్టర్ తప్పకుండా అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇలాంటి మంచి చిత్రాలు మరిన్ని రావాలి. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థాంక్స్. ఈ సినిమా కోసం నేను కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. ” అని చెప్పారు.
సాయి కుమార్ మాట్లాడుతూ.. “ఈ చిత్రాన్ని చేనేత కార్మికులకు అంకితం ఇస్తున్నాము. చేనేత కార్మికుడిగా ఇందులో నటించడం నా అదృష్టం. పోచంపల్లి చేనేత కార్మికుల గురించి చాలా చక్కగా ఇందులో చూపించాడు దర్శకుడు అను ప్రసాద్. ఇదొక గ్రేట్ కాన్సెప్ట్. ఈ చిత్రంలో కనిపించే మూడు సింహాలు విరాజ్, అను, నిరీష్ అయితే కనిపించనీ నాలుగో సింహం బెక్కం వేణుగోపాల్ గారు. బేబీ తర్వాత వస్తున్న ఈ చిత్రం విరాజ్ కి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తుంది. అన్ని సినిమాలు బాగా ఆడాలి అందులో మన సినిమా ఉండాలి అని కోరుకుంటున్నా” అని అన్నారు.
సోహైల్ మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యంగ్ జనరేషన్ కు మనకు మనమే సపోర్ట్ చేసుకోవాలని బెక్కం గారు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఆ ఉద్దేశంతోనే విరాజ్  ను ఎంకరేజ్ చేయడానికి వచ్చాను. ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. చిన్న సినిమా అయినా ప్రొడక్షన్ వాల్యూస్ హై లో ఉన్నాయి. బేబీ తరహాలో ఈ సినిమా కూడా సక్సెస్ అవ్వాలని, విరాజ్ కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా” అని అన్నారు.
తిరువీర్ మాట్లాడుతూ.. “విరాజ్ మంచి సబ్జెక్టులను సెలక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్” అని చెప్పారు.
సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ.. “మంచి సినిమాను సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థాంక్యూ. విరాజ్ కు మరో బ్లాక్ బస్టర్ రావాలని కోరుకుంటున్నా. ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు,  దర్శకుడికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. డిసెంబర్ 15న మీ దగ్గరలోని థియేటర్లలో సినిమా చూడండి.. నచ్చితే మరో పదిమందికి చెప్పండి. ఫ్యామిలీ, ఎమోషన్, లవ్, ఫన్ అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి” అని అన్నారు.
పూజిత పొన్నాడ మాట్లాడుతూ.. “ఈ చిత్రం మంచి ఉగాది పచ్చడి లాంటిది. ఇందులో అన్ని రుచులు ఉన్నాయి. అందరినీ నవ్వించే కామెడీ ఉంది.  ఎమోషన్స్ ఉన్నాయి. యూత్ ఫుల్ రొమాన్స్ కూడా ఉంది అందరికీ బాగా నచ్చుతుంది” అని చెప్పింది.
ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ ..”సినిమా సక్సెస్ అవ్వాలి. నిర్మాత నిరీష్ మరిన్ని సినిమాలు తీయాలి. సాయికుమార్ లాంటి సీనియర్ ఆర్టిస్టులు ఇందులో నటించడం ఈ సినిమాకి ప్లస్ అవుతుంది మీ అందరికీ ఆల్ ద బెస్ట్” అని చెప్పారు.
చిత్ర దర్శకుడు అను ప్రసాద్ మాట్లాడుతూ..”ఇది నా మొదటి చిత్రం. ఐదు సినిమాలకు పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఈ మూవీతో వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ ప్రణీత్ ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది. ఈ కథను  ఒప్పుకున్న, విరాజ్, పూజిత గారికి థాంక్స్.
నిర్మాత నిరీష్ గారు ఒక బ్రదర్ లా నన్ను ట్రీట్ చేసి చాలా బాగా సపోర్ట్ చేశారు. డిఓపి మహి మంచి విజువల్స్ అందించారు. అవుట్ పుట్ రెడీ అయ్యాక రిలీజ్ విషయంలో బెక్కం వేణుగోపాల్ గారు అందించిన సహాయం మర్చిపోలేము” అని చెప్పారు.
నిర్మాత నిరీష్ మాట్లాడుతూ.. “డైరెక్టర్ అను ప్రసాద్ ఏదైతే కథ చెప్పాడో అదే తీశారు. ఆయన ఫ్యూచర్ లో మంచి డైరెక్టర్ అవుతారు. మన సినిమా సక్సెస్ అయినా, అవ్వకపోయినా మీతో వర్క్ చేసినందుకు ప్రౌడ్ గా ఉంది. సాయికుమార్ గారు మా ప్రాజెక్టులోకి రావడం మాకు మరింత హెల్ప్ అయ్యింది. ఈ కథ ఒప్పుకున్న విరాజ్ తన 100% ఇచ్చారు. సపోర్ట్ చేసిన ఆర్టిస్టులకు టెక్నీషియన్స్ కు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సినిమా రిలీజ్ కోసం బెక్కం వేణుగోపాల్ గారి సహకారం మర్చిపోలేనిది. అందరూ ఎంజాయ్ చేసేలా *జోరుగా హు* చిత్రం ఉంటుంది” అని చెప్పారు.
నటీనటులు మధు నందన్, మేఘ లేఖ,  సతీష్, క్రేజీ ఖన్నా, సమీరా, సినిమాటోగ్రాఫర్ మహి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విరాజ్ అశ్విన్‌, పూజిత పొన్నాడ‌, సాయికుమార్‌, రోహిణి, మ‌ధునంద‌న్‌, సిరి హ‌నుమంతు, సోనూ ఠాకూర్‌,  బ్రహ్మ‌జీ , చ‌మ్మ‌క్ చంద్ర‌, క్రేజీ క‌న్నా త‌దిత‌రులు న‌టిస్తున్న చిత్రానికి ఈ చిత్రానికి  సంగీతం: ప్రణీత్, ఎడిట‌ర్‌: మార్తాండ్ కె వెంక‌టేష్‌, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: తేజ తిరువిధుల