తెరచాప మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

నవీన్ రాజ్ సంకరపు, పూజా సుహాసిని శ్రీలు కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం తెరచాప.
జోయల్‌ జార్జ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అనన్యా క్రియేషన్స, హరితవనం ఎంటర్‌టైనమెంట్స్‌ పతాకాలపై కైలాష్‌ దుర్గం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ను మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సినిమా కథ, కథనం, టేకింగ్‌, నిర్మాణ విలువలు అన్ని విషయాలు నాకు తెలుసు. టైటిల్‌. డిజైనింగ్‌ చాలాబావుంది. సినిమా బాగా ఆడి మంచి విజయాన్ని ఈ టీమ్‌ అందించాలని కోరుకుంటున్నా. అందరికీ ఆల్‌ ద బెస్ట్‌ అని అన్నారు.

నటీనటులు:

నవీన్ రాజ్ సంకరపు, పూజా సుహాసిని, శ్రీలు, జగదీష్‌ ప్రతాప్‌ బండారి, రాజీవ్‌ కనకాల, రాకీ, నాగ మహేష్

సాంకేతిక నిపుణులు :

దర్శకత్వం : జోయల్‌ జార్జ్‌
నిర్మాత : కైలాష్‌ దుర్గం
నిర్మాణ సంస్థ : అనన్యా క్రియేషన్స, హరితవనం ఎంటర్‌టైనమెంట్స్‌
సంగీతం: ప్రజ్వల్‌ క్రిష్‌
కెమెరా: అజీమ్‌ – వెంకట్‌
ఎడిటర్‌: బొడిసింగి రాజు