దీన్ తననా చిత్రం ప్రారంభం

Published On: March 7, 2024   |   Posted By:

దీన్‌ తననా చిత్రం ప్రారంభం

లండన్‌లో ప్రారంభమైన నూతన చిత్రం దీన్‌ తననా..

గురువారం లండన్‌లో తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తోన్న ద్విభాషా చిత్రం ప్రారంభమైంది. పవన్‌ కల్యాణ్‌ బ్రో చిత్రంలో సాయిధరమ్‌ తేజ్‌ తమ్ముడిగా మంచి మార్కులు కొట్టేశాడు శ్రీనివాస్‌. బ్రో చిత్రం తర్వాత శ్రీనివాస్‌ ఫుల్‌ బిజి అయ్యారు. ఈ సినిమాలో శ్రీనివాస్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఏ స్టార్‌ ప్రొడక్షన్స్, ఏబి ఇంటర్‌నేషనల్‌ ఫిలింస్, అనిక ప్రొడక్షన్‌లు సంయుక్తంగా ఈ దీన్‌ తననా చిత్రాన్ని హుస్సేన్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాయి. తొలి షాట్‌ను ప్రముఖ నటుడు అలీ, శ్రీనివాస్‌లపై చిత్రీకరించారు. ఈ షెడ్యూల్‌లో పదిరోజుల పాటు షూటింగ్‌ చేసుకుని ఇండియాకి తిరిగి వచ్చేస్తామని దర్శకుడు హుస్సేన్‌ తెలిపారు. త్వరలోనే మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియచేస్తామని చిత్ర యూనిట్‌ తెలిపింది.