ధృవ నక్షత్రం సినిమా ట్రైలర్ రిలీజ్

చియాన్ విక్రమ్ ధృవ నక్షత్రం సినిమా ట్రైలర్ రిలీజ్

వర్సెటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ధృవ నక్షత్రం. రితూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఓండ్రగ ఎంటర్ టైన్ మెంట్ ఒరువూరిలియోరు ఫిల్మ్ బ్యానర్స్ పై నిర్మిస్తూ రూపొందిస్తున్నారు. రెండు భాగాలుగా తెరపైకి రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ “ధృవ నక్షత్రం, ఛాప్టర్ 1 యుద్ధకాండం ఈ నెల 24న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ట్రైలర్ ను ఇవాళ రిలీజ్ చేశారు.

ధృవ నక్షత్రం, ఛాప్టర్ 1 యుద్ధ కాండం ట్రైలర్ ఎలా ఉందో చూస్తే ముంబై పై టెర్రరిస్ట్ దాడి జరిగినప్పుడు అప్పటి ఎన్ఎస్ జీ టీమ్ లో ఉన్న ఓ సీనియర్ ఆఫీసర్ తమ వృత్తిలోని సవాళ్లను గురించి మరో వ్యక్తికి చెబుతుంటాడు. చట్టంలోని రూల్స్ రెగ్యులేషన్స్ ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో తమకు అడ్డుగా మారుతున్నాయని, అందుకే చట్టంతో పనిలేని బేస్ మెంట్ అనే ఓ కోవర్ట్ టీమ్ ను తయారు చేసినట్లు ఆ సీనియర్ ఆఫీసర్ వెల్లడిస్తాడు. క్రికెట్ టీమ్ లా 11 మంది ఉండే బేస్ మెంట్ కోవర్ట్ టీమ్ లోకి స్పెషలిస్ట్ ఆఫీసర్ గా వస్తాడు జాన్. ఈ కోవర్ట్ టీమ్ తరుపున టెర్రరిస్టులతో జాన్ చేసే పోరాటాన్ని ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు. గ్రాండ్ మేకింగ్ వ్యాల్యూస్, హై ఎండ్ యాక్షన్ సీక్వెన్సులు ఆకట్టుకున్నాయి. జాన్ క్యారెక్టర్ లో చియాన్ విక్రమ్ కూల్ అండ్ స్టైలిష్ గా కనిపించారు. ఈ సినిమాలో డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఓ కీ రోల్ లో నటించారు.

ధృవ నక్షత్రం ఛాప్టర్ 1 యుద్ధ కాండం ట్రైలర్

 నటీనటులు: 

చియాన్ విక్రమ్, రితూ వర్మ, ఆర్. పార్తీబన్, ఆర్. రాధిక శరత్ కుమార్, సిమ్రాన్, వినాయకన్, దివ్య దర్శిని, మున్నా సైమన్, వంశీ కృష్ణ, సలీమ్ బేగ్, సతీష్ కృష్ణన్, మాయ ఎస్ కృష్ణన్ తదితరులు

సాంకేతికవర్గం:

ఎడిటర్ – ఆంటోనీ
మ్యూజిక్ – హ్యారిస్ జయరాజ్
సినిమాటోగ్రఫీ  – మనోజ్ పరమహంస, ఎస్ఆర్ కతీర్, విష్ణు దేవ్
నిర్మాత, రచన, దర్శకత్వం – గౌతమ్ వాసుదేవ్ మీనన్