నారప్ప చిత్రం అమేజాన్ ప్రైమ్ విడుదల

జూలై 20న అమేజాన్ ప్రైమ్ లో విడుదలకానున్న విక్టరీ వెంకటేష్  నారప్ప

విక్ట‌రి వెంక‌టేష్ హీరోగా మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `నార‌ప్ప‌`. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్ లో విడుదలకానుంది.

ఇప్ప‌టికే పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 20న అమేజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల కానుంది. ఈ విషయాన్ని  అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్.

ఈ మూవీలో డిఫ‌రెంట్‌ షేడ్స్ ఉన్న స‌రికొత్త పాత్రల‌లో విక్ట‌రి వెంకటేష్ కనిపించనున్నారు. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో నార‌ప్ప భార్య `సుందరమ్మ`గా తెలుగు వారికి  చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు.

ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ మ‌రియు ఇత‌ర ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.

తారాగ‌ణం: విక్టరి వెంకటేష్‌, ప్రియమణి, కార్తిక్ ర‌త్నం, రావు ర‌మేష్‌, రాజీవ్ క‌న‌కాల త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల
నిర్మాతలు: డి. సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు
ఎడిటర్‌: మార్తాండ్ కె. వెంకటేష్‌
ఆర్ట్‌: గాంధీ నడికుడికర్‌
కథ: వెట్రిమారన్‌
స్క్రిప్ట్ కన్సల్టెంట్: సత్యానంద్
ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, విజయ్‌
లిరిక్స్‌: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌ తేజ, అనంతశ్రీరామ్‌, కృష్ణకాంత్‌, కాసర్ల శ్యాం