పొన్నియన్‌ సెల్వన్‌ 1 రివ్యూ

Published On: September 30, 2022   |   Posted By:
పొన్నియన్‌ సెల్వన్‌ 1 రివ్యూ
మణిరత్నం ‘పొన్నియన్‌ సెల్వన్‌ 1’ రివ్యూ

Emotional Engagement Emoji (EEE)
 
👍

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని దర్శకుడు మణిరత్నం. ఆయన సొంత నిర్మాణ సంస్థ మద్రాస్‌ టాకీస్‌, లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ సంయుక్తంగా సుభాస్కరన్‌ సమర్పణలో నిర్మించిన  సినిమా ఇది. అదే పేరుతో సుప్రసిద్ధ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా రూపొందించారు. తెలుగులో సోసోగా తమిళనాట భారీ ఎక్సపెక్టేషన్స్ తో రిలీజైన ఈ చిత్రం ఎలా ఉంది…కథేంటి…మన తెలుగువాళ్లకు నచ్చే అంశాలు ఉన్నాయా చూద్దాం.

స్టోరీ లైన్:

దాదాపు వెయ్యేళ్ల క్రితం చోళులు కాలంలో జరిగే కథ ఇది. తమ గూడఛారి వల్లవ రాయన్ (కార్తి) కి రాజు  ఆదిత్య కరికాలన్ (విక్రమ్) ఓ పని అప్పచెప్తాడు. తమ రాజ్య సింహాసనం చుట్టూ  జరుగుతున్న కుట్ర వెనక ఉన్నదెవరో తేల్చమని కోరతాడు. అక్కడ నుంచి వల్లవరాయన్ జర్నీ ప్రారంభమవుతుంది. కొద్ది రోజుల్లోనే ఆ కుట్ర వెనక ఉన్నది మరెవరో కాదని  పెద్ద పల్వేట్ట రాయుడు (శరత్ కుమార్) అని తెలుసుకుంటాడు. అతని నేతృత్వంలో సామంత రాజులంతా కలిసి చోళ రాజ్యాన్ని చేజిక్కించుకోవడానికి కుట్ర పన్నుతున్నారని అర్దం చేసుకుంటాడు.  ఆ క్రమంలో తన రాజకు తమ్ముడైన  అరుణ్మొళి (జయం రవి) ని అంతమొందించాలనుకుంటారని అర్దం చేసుకుంటాడు. అప్పుడు  అరుణ్మొళి ని రక్షించాలని నిర్ణయించుకుంటాడు.  మరో ప్రక్క  చోళ రాజుల వల్ల  తమ రాజ్యాన్ని కోల్పోయిన పాండ్య రాజులు అరుణ్మొళిని అంతమొందించడానికి పన్నాగం పన్నుతారు. మరి ఈ దాడుల నుంచి అరుణ్మొళి తప్పించుకున్నాడా.. వల్లవరాయుడు అతణ్ని కాపాడగలిగాడా.. చోళ రాజులకు వ్యతిరేకంగా జరిగిన కుట్ర ఎంత మేరకు ఫలించింది, అసలు పొన్నియన్ సెల్వన్ ఎవరు…అతనికి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

స్క్రిప్టు ఎనాలసిస్…

ఐదు భాగాలుగా ఉన్న ‘పొన్నియన్ సెల్వన్’ నవలను కుదించి.. రెండు భాగాల సినిమాగా తెరకెక్కించటం దగ్గరే సమస్య వచ్చిందనిపిస్తోంది. ఎందుకంటే నవల్లో మహా భారతంలో ఉన్నట్లు చాలా పాత్రలు, ట్విస్ట్ లు, కథ, కథనాలు ఉంటాయి. వాటిలో ఫలానా వాడు హీరో , ఫలానా వారు విలన్ అని నడవదు. ఎవరి వైపు నుంచి వాళ్లకు కథ ఉంటుంది. అయితే అది నవల చదివేటప్పుడు ఏ సమస్యా రాదు. కానీ సినిమా దగ్గరకు వచ్చేసరికి హీరో ,విలన్, మలుపులు ఆశిస్తాం. కానీ మణిరత్నం నవలను చెడిపోదుందనుకున్నారో ఏమో కానీ ఆ మార్పులు ఏమీ చెయ్యకుండా సినిమా ఎలా ఉందో అలాగే చేసుకుంటూ పోయారు. అయితే ఈ క్రమంలో ఎక్కడ మొదలెట్టాలి…ఏ పాత్రలను తెరపై చూపాలి..దేనికి ప్రయారిటీ ఇవ్వాలనే విషయం ఆయనకు కన్ఫూజన్ వచ్చినట్లుంది. ఆయన నవలను బాగా ప్రేమించారు. చాలా కాలంగా చేద్దామనుకున్న డ్రీమ్ ప్రాజెక్టు ఇది. దాంతో ఈ నవల తెర రూపం ఎక్కే క్రమంలో దర్శకుడు మైండ్ లో అంతా ఉండి ఉంటుంది కానీ తెరపైన అదేమీ ఎస్టాబ్లిష్ కాలేదు. ఒక్కో పాత్రా పరిచయం చేసుకుంటూ వెళ్తూంటే మనకు విసుగొస్తుంది. కేవలం కార్తిని హీరోగా చేసి కథ నడిపినా బాగుండేదే అనిపిస్తుంది. విక్రమ్ సైడ్ లైన్ అయ్యిపోయారు. విక్రమ్ హీరో అనుకుని ఫాలో అవుదామనుకుంటే ఆ పాత్ర సినిమా ప్రారంభమైన కాసేపటికే ఆగిపోయి..ఇంట్రవెల్ కి గానీ సీన్ లోకి రాదు. ఇక నందిని (ఐశ్వర్యారాయ్) పాత్రను మిస్టరీ ఉమెన్ గా నెగిటివ్ షేడ్స్ తో తీర్చిదిద్దారు. సెకండ్ పార్ట్ ఉండటంతో ఆ పాత్రకు కంక్లూజన్ లేదు.అసలు ఆమె ఎవరో తేలదు. ఇలా చాలా పాత్రకు ప్రారంభం,ముగింపు, మధ్య లేకుండా కథ,కథనం రాసుకోవటం దెబ్బ కొట్టింది. అసలే తమిళ చరిత్ర. దానికి తోడు సరైన స్క్రీన్ ప్లే తో కథ నడపక పోవటం సినిమాని పూర్తి స్దాయిలో దెబ్బకొట్టిందనే చెప్పాలి.   ఏదైమైనా మెయిన్ క్యారక్టర్స్ తో మనకు  కనెక్షన్ ఏర్పడనపుడే, ఆ పాత్రల తాలూకు ఎమోషన్లను ఫీలవగలుగుతాం.   కథతో ఇన్వాల్వ్  కాలేము.  ‘పొన్నియన్ సెల్వన్’కు సంబంధించి అతి పెద్ద సమస్య ఇదే.

టెక్నికల్ గా ..

ఈ సినిమాలో మణిరత్నం చాలా అద్బుతమైన విజువల్స్ ని పరిచాడు. ఆయన మాస్టర్ ని మరోసారి అనిపించుకున్నారు. అలాగే తోట తరణి ప్రొడక్షన్ డిజైన్ కూడా అద్బుతంగా ఉంది. రవి వర్మ కెమెరా వర్క్ సినిమాకు నిండుతనం తెచ్చింది. ఏ ఆర్ రహమాన్ పాటలు ఓకే అనిపించుకున్నా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్బుతంగా ఇచ్చారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్  ఎప్పటిలాగే బాగుంది. ఎన్ని ఉన్నా స్క్రిప్టు, స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవటం సినిమాకు మైనస్ గా నిలిచింది. తెలుగు డబ్బింగ్ బాగుంది. తణికెళ్ల డైలాగులు కూడా యాప్ట్ గా ఉన్నాయి.

నటీనటుల్లో ..

ఇది విక్రమ్ కథ కాదు. అతన్ని నుంచి ఏమీ ఆశించలేం. ఉన్నంతలో బాగా చేసాడు. జయం రవి మనకు పెద్దగా తెలుగులో పరిచయం లేదు. ఇక్కడ మనకు ఎక్కడు. అలాగని అతను బాగా చెయ్యలేడని అనలేం. ఇక  కార్తి పాత్రను  కామెడీ టైమింగ్ తో బాగా పండించారు.  ఐశ్వర్యారాయ్ నందిని గా మిస్టరీయిస్ ఉమెన్ గా అదరకొట్టింది.  కుందేవి పాత్రలో త్రిష ఫరవాలేదనిపించింది. జయరాం వెరైటీగా కనిపించాడు. ప్రకాష్ రాజ్..ఎప్పటిలాగే బాగా చేసారు.

చూడచ్చా

పొన్నియన్ సెల్వన్ నవల చదివిన వారు కథ అర్దమవుతుంది. వారు చూస్తే సినిమా నచ్చే అవకాసం ఉంది. లేదా తమిళ చరిత్ర మీద అవగాహన అయినా ఉండాలి.


నిర్మాణ సంస్థలు: లైకా ప్రొడక్షన్స్‌, మద్రాస్‌ టాకీస్‌,
నటినటులు  : కార్తీ, త్రిష, ఐశ్వర్యరాయ్, విక్రమ్, జయం రవి, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాల, విక్రమ్ ప్రభు, ప్రభు, ఆర్. శరత్ కుమార్, జయరామ్, ఆర్. పార్తిబన్, ప్రకాష్ రాజ్, రెహమాన్ తదితరులు .
కథనం: జైమోహన్‌,
ఛాయాగ్రహణం: ఎస్‌. రవి వర్మన్‌,
కళా దర్శకత్వం: తోట తరణి,
కూర్పు: అక్కినేని శ్రీకర్‌ ప్రసాద్‌,
నిర్మాతలు: మణిరత్నం, శుభస్కరన్ అల్లి రాజా
సంగీతం: ఏఆర్ రెహమాన్
సమర్పణ: సుభాస్కరన్‌.
దర్శకత్వం: మణిరత్నం
Run Time: 2h 50m
విడుదల తేదీ : 30 సెప్టెంబర్ 2022