బుజ్జి ఇలా రా 2 సినిమా ప్రారంభం

Published On: October 28, 2023   |   Posted By:

బుజ్జి ఇలా రా 2 సినిమా ప్రారంభం

ధనరాజ్ ప్రధాన పాత్రలో కాసిమ్ గారి నిర్మాణ సారథ్యం లో మై సినిమా టాకీస్ బ్యానర్ పై రోరింగ్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ బుజ్జి ఇలా రా 2 అనే సినిమా భారీగా ప్రారంభం అయ్యింది ఈ చిత్రం 2022 లో రిలీజ్ అయిన బుజ్జి ఇలా రా అనే హిట్ సినిమాకి సీక్వెల్ గా రూపుదిద్దుబడుతుంది బుజ్జి ఇలా రా సినిమా కి దర్శకత్వం మరియు ఛాయ గ్రహణం వహించిన గరుడవేగ అంజి నే ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు దర్శకత్వం మీద పూర్తి దృష్టి పెట్టాలనే ఉద్దేశం తో ఈ సినిమాకి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అయిన సర్వేశ్ మురారి గారు సినిమాటోగ్రఫీ వహిస్తున్నారని డైరెక్టర్గరుడవేగ అంజి గారు తెలిపారు ఈ సినిమాకి పాటలు మరియు బ్యాక్గ్రాండ్ స్కోర్ చరణ్ అర్జున్ సమకూర్చగా ఎడిటింగ్ చోటా. కె.ప్రసాద్ గారు చెయ్యనున్నారు ఈ సినిమా నో లిమిట్స్ అనే ట్యాగ్ లైన్ తో రూపుదిద్దుకోబోతుంది ఈ సినిమా లోథ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తోపాటు తండ్రి కూతుర్ల ఎమోషన్ కూడా ప్రేక్షకులకు మంచి అనుభూతినిస్తుందని చిత్ర బృందం పేర్కుంది ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూఈ సినిమా లోగో నీ ఓంకార్ గారు మరియు కెమెరామెన్ సెంథిల్ కుమార్ గారు ఆవిష్కరించారు, ఈ సినిమా కి క్లాప్ ని సాయి రాజేష్ గారు, ఫస్ట్ షాట్ డైరెక్షన్ విజయ్ కనక మేడలా , కెమెరా స్విచ్ ఆన్ సి. కళ్యాణ్ గారు చేశారు, తెలుగు సినిమా స్క్రిప్ట్ ని కోన వెంకట్ గారు , తమిళ సినిమా స్క్రిప్ట్ ని దామోదర్ ప్రసాద్ గారు దర్శక నిర్మాతలకు అందచేసారు. అందరూ అతిధులు కలిసి
మోషన్ పోస్టర్ ని లంచ్ చేశారు.