భగవంత్ కేసరి మూవీ ట్రైలర్ అక్టోబర్ 8 విడుదల

Published On: October 5, 2023   |   Posted By:

భగవంత్ కేసరి మూవీ ట్రైలర్ అక్టోబర్ 8 విడుదల

నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి, షైన్ స్క్రీన్స్ భగవంత్ కేసరి థియేట్రికల్ ట్రైలర్ అక్టోబర్ 8న విడుదల

రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి మేకర్స్ ప్రమోషన్స్ లో జోరు పెంచారు. టీజర్ నుంచి పాటల వరకు సినిమా ప్రమోషన్ ఎలిమెంట్స్ మ్యాసివ్ బజ్‌ని సృష్టించాయి. ఇప్పుడు, సినిమా థియేట్రికల్ ట్రైలర్‌కి సమయం ఆసన్నమైంది. అక్టోబర్ 8న ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ యాక్షన్-ప్యాక్డ్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు.

పోస్టర్‌లో బాలకృష్ణ చేతిలో కర్రతో కుర్చీపై కూర్చున్న విజువల్ కనిపిస్తుంది. బాలకృష్ణ ఇంటెన్స్ గా చూస్తుండగా, అతని వెనుక పోలీసు అధికారులు నిలబడి ఉన్నారు. మాస్, యాక్షన్ అంశాలతో పాటు, సినిమాలో హృదయానికి హత్తుకునే భావోద్వేగాలు కూడా ఉంటాయి.

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని అవతార్‌లో చూపించేందుకు దర్శకుడు అనిల్ రావిపూడి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.

సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా, నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. జాతీయ అవార్డు విన్నర్ అర్జున్ రాంపాల్ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.

ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ సి రామ్ ప్రసాద్, ఎడిటర్ తమ్మి రాజు, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవ్. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

భగవంత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానుంది.

నటీనటులు :

నందమూరి బాలకృష్ణ, అర్జున్ రాంపాల్, కాజల్ అగర్వాల్, శ్రీలీల

సాంకేతిక విభాగం :

రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
బ్యానర్: షైన్ స్క్రీన్స్
సంగీతం: ఎస్ఎస్ థమన్
డీవోపీ: సి రామ్ ప్రసాద్
ఎడిటర్: తమ్మి రాజు