భూతద్ధం భాస్కర్ నారాయణ మూవీ టైటిల్ సాంగ్ విడుదల

Published On: January 6, 2024   |   Posted By:

భూతద్ధం భాస్కర్ నారాయణ మూవీ టైటిల్ సాంగ్ విడుదల

శివ కందుకూరి భూతద్ధం భాస్కర్ నారాయణ టైటిల్ సాంగ్ విడుదల

శివ కందుకూరి హీరోగా భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా రూపొందింది. స్నేహాల్ .. శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి, పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో టీజర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది.

న్యూ ఏజ్ స్టార్ కంపోజర్ శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ ని విడుదల చేశారు మేకర్స్. శ్రీచరణ్ పాకాల స్వరపరిచి స్వయంగా పాడిన ఈ పాట చాలా క్యాచిగా వుంది. పురుషోత్తం రాజ్, సురేష్ బనిశెట్టి రాసిన లిరిక్స్ హీరో క్యారెక్టరైజేషన్ ని ఆకట్టుకునేలా ప్రజెంట్ చేశాయి. పాటలో విజువల్స్ చాలా ఎట్రాక్టివ్ గా వున్నాయి.

రాశి సింగ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అరుణ్ కుమార్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, శివన్నారాయణ, కల్పలత ఇతర కీలక పాత్రలు పోషించారు.

ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు

నటీనటులు :

శివ కందుకూరి, రాశి సింగ్ అరుణ్ కుమార్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, శివన్నారాయణ, కల్పలత తదితరులు

సాంకేతిక వర్గం :

దర్శకత్వం  పురుషోత్తం రాజ్
నిర్మాతలు  స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై
సంగీతం  శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్
డీవోపీ  గౌతమ్ జార్జ్