మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా! మూవీ టైటిల్ లాంచ్ ఈవెంట్

Published On: January 22, 2024   |   Posted By:

మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా! మూవీ టైటిల్ లాంచ్ ఈవెంట్

ఈ న‌గ‌రానికి ఏమైంది, మీకు మాత్ర‌మే చెబుతా, సేవ్ టైగ‌ర్ చిత్రాల్లో క‌మెడియ‌న్‌గా పాపులారిటీ సంపాందించుకుని, త‌న‌కంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న న‌టుడు అభిన‌వ్ గోమ‌ఠం. అయితే తాజాగా ఈ న‌గ‌రానికి ఏమైంది చిత్రంలో అత‌ని పాపుల‌ర్ డైలాగ్ అయిన మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా టైటిల్‌తోనే అభిన‌వ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతుంది. వైశాలి రాజ్ హీరోయిన్‌. కాసుల క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాక‌పంపై తిరుప‌తి రావు ఇండ్ల ద‌ర్శ‌క‌త్వంలో భ‌వాని కాసుల‌, ఆరెమ్ రెడ్డి, ప్ర‌శాంత్‌.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొలిమేర‌2 చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేసి, మంచి అభిరుచి గ‌ల నిర్మాత‌గా పేరు సంపాందిచుకున్న నిర్మాత‌, పంపిణీదారుడు వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. ఇటీవ‌ల ఈ చిత్రం టైటిల్ లోగోను ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్‌తో పాటు, ఓ కాలేజీలో జ‌రిగిన వేడుక‌లో అక్క‌డి విద్యార్థులు విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ హాస్య‌న‌టుడిగా, స‌హాయ నటుడిగా అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్న అభిన‌వ్ గోమఠం లోని కొత్త కోణాన్ని, న‌టుడిలోని మ‌రో కోణాన్ని ఈ చిత్రంలో చూస్తారు. అయోధ్యలోని శ్రీ సీతారాముల ప్రాణ ప‌తిష్ట రోజే మా సినిమా లోగోను ఆవిష్క‌రించ‌డం ఎంతో ల‌క్కీగా భావిస్తున్నాం. అన్నిభావోద్వేగాల మేళ‌వింపుతో ల‌వ్‌, కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నా. కొత్త‌దనంతో కూడిన ఈ చిత్రం త‌ప్ప‌కుండా అంద‌ర్ని అల‌రిస్తుంద‌నే న‌మ్మ‌కం వుంది. ఫిబ్ర‌వ‌రి ద్వితియార్థంలో చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

నటీనటులు :

త‌రుణ్‌భాస్క‌ర్‌, అలీ రేజా, మొయిన్‌, చ‌క్ర‌పాణి ఆనంద్‌, నిళ‌గ‌ల్ ర‌వి, జ్యోతి రెడ్డి, లావ‌ణ్య రెడ్డి, శ్వేత అవ‌స్థి, ర‌వీంద‌ర్ రెడ్డి, సూర్య‌, రాకెట్ రాఘ‌వ, సాయిక్రిష్ణ‌, ఫ‌ణి చంద్ర‌శేఖ‌ర్

సాంకేతిక వర్గం :

కెమెరా: సిద్దార్థ స్వ‌యంభూ
ఎడిట‌ర్‌: ర‌వితేజ గిరిజాల‌
సంగీతం: సంజీవ్ టి
నేప‌థ్య సంగీతం: శ్యాముల్ అబే
ఎడిట‌ర్ ర‌వితేజ గిరిజాల‌