మూవీ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న యాంగ్రీ మ్యాన్ డా.రాజశేఖ‌ర్

Published On: October 17, 2023   |   Posted By:

మూవీ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్‌ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్న యాంగ్రీ మ్యాన్ డా.రాజశేఖ‌ర్

నితిన్‌, వ‌క్కంతం వంశీ, శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య మూవీస్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ మూవీ ఎక్స్ ట్రా – ఆర్డినరీ మ్యాన్‌ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్న యాంగ్రీ మ్యాన్ డా.రాజశేఖ‌ర్

టాలెంటెడ్, ఛ‌ర్మిస్మేటిక్ హీరో నితిన్ లేటెస్ట్ మూవీ ఎక్స్ ట్రా. రైటర్, డైరెక్టర్ వక్కంతం వంశీ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమాను రూపొందిస్తున్నారు. మోస్ట్ హ్యాపినింగ్ బ్యూటీ శ్రీలీల ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుంది. సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

సోమ‌వారం ఈ సినిమాకు మేక‌ర్స్ ఓ స్పెష‌ల్ అనౌన్స్‌మెంట్ చేశారు. ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో యాంగ్రీ మ్యాన్ డా.రాజ‌శేఖ‌ర్ న‌టిస్తున్నారు. ఎన్నో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో మెప్పించి, ప‌లువురి హృద‌యాల్లో న‌టుడిగా త‌న‌దైన స్థానాన్ని ద‌క్కించుకున్న రాజ‌శేఖ‌ర్ ఎక్స్ ట్రా – ఆర్డిన‌రీ మ్యాన్‌లో న‌టించ‌టం ఆడియెన్స్‌కు స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్. అందులో భాగంగా ఆయ‌న ఈరోజు సెట్స్‌లోకి అడుగు పెట్టారు. ఎంటైర్ టీమ్ ఆయ‌నకు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. రాజ‌శేఖ‌ర్ స్టైలిష్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. ఈ స‌డెన్ స‌ర్‌ప్రైజింగ్ అనౌన్స్మెంట్‌తో సినిమాపై ఉన్న అంచ‌నాలు నెక్ట్స్ లెవ‌ల్‌కు చేరుకున్నాయి. డిసెంబ‌ర్ 8న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు నితిన్ త‌న కెరీర్‌లో చేయ‌ని పాత్ర‌ను ఎక్స్ సినిమాలో చేస్తుండ‌టం విశేషం. ఆయ‌న త‌న‌దైన శైలిలో త‌న క్యారెక్ట‌ర్‌లో ఇమిడిపోయారు. ఇదొక క్యారెక్ట‌ర్ బేస్డ్ స్టోరీ, క‌చ్చితంగా ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌ని డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ తెలిపారు.

మ్యూజికల్ జీనియ‌స్ హేరిస్ జయ‌రాజ్ సంగీతం అందిస్తుండ‌టం సినిమాకు పెద్ద ఎసెట్‌గా మారింది. రీసెంట్ విడుద‌లైన డేంజ‌ర్ పిల్లా సాంగ్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య‌మూవీస్ & ఎంట‌ర్ టైన్‌మెంట్స్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్స్‌పై సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.