మెర్సి కిల్లింగ్ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల

Published On: March 19, 2024   |   Posted By:

మెర్సి కిల్లింగ్ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల

“మెర్సి కిల్లింగ్” ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన హీరో ఆకాష్ పూరి !!!
సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కిన సినిమా “మెర్సి కిల్లింగ్” సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో  సిద్ధార్ద్ హరియల,  మాధవి తాలబత్తుల నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీమతి వేదుల బాల కామేశ్వరి సమర్పిస్తున్నారు.
సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు జి.అమర్ సినిమాటోగ్రాఫి అందిస్తుండగా ఎం.ఎల్.రాజా సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను యువ హీరో ఆకాష్ పూరి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆకాష్ పూరి మాట్లాడుతూ…
మెర్సి కిల్లింగ్ టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉంది, మొషన్ పోస్టర్ లో కాన్సెప్ట్ బాగుంది, ఇలాంటి కాన్సెప్ట్ తో వస్తోన్న సినిమాలు తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో రాబోతున్న ఈ చిత్రం హైదరాబాద్, కాకినాడ, ఉప్పాడ, అరకు వంటి అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించడం జరిగింది. ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ సక్సెస్ అవ్వాలని అన్నారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన చిత్రం మెర్సీ కిల్లింగ్ . స్వేచ్ఛ అనే అనాధ బాలిక తనకు న్యాయం జరగాలంటూ ఈ కథ ప్రారంభం అవుతుందని దర్శకుడు వెంకటరమణ ఎస్ తెలిపారు.
నటీనటులు:
సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, బేబీ హారిక, రామరాజు, సూర్య, ఆనంద్ చక్రపాణి, ఘర్షణ శ్రీనివాస్, షేకింగ్ శేషు, ఎఫ్.ఎం.బాబాయ్, రంగస్థలం లక్ష్మీ, ల్యాబ్ శరత్, హేమ సుందర్, వీరభద్రం, ప్రమీల రాణి తదితరులు.
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్
డైరెక్టర్: వెంకటరమణ ఎస్
నిర్మాతలు: సిద్ధార్థ్ హరియల, మాధవి తాలబత్తుల
సమర్పణ: శ్రీమతి వేదుల బాల కామేశ్వరి
సినిమాటోగ్రఫీ: అమర్.జి
సంగీతం: ఎం.ఎల్.రాజ
ఎడిటర్: కపిల్ బల్ల
ఆర్ట్: నాయుడు
మాటలు: వై. సురేష్ కుమార్