రాజా రమ్యం మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కుతున్న రాజా రమ్యం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

విగ్నేష్ రెడ్డి గవి మరియు శ్రీ ఆశ్రిత కీలక పాత్రలు పోషిస్తున్న రాజా రమ్యం అనే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈరోజు విడుదల చేయడం జరిగింది. ప్రనిల్ గౌరీ పాగ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ఆర్వన్ గండికోట కథ మరియు స్క్రీన్ ప్లే అందించారు. కోకొండ జయచందర్ రెడ్డి, సంజయ్ రెడ్డి మరియు అనిల్ పల్లాల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని గావి ఫిలిమ్స్ మరియు సిల్లీ మాంక్స్ స్టూడియోస్ పై తెరకెక్కిస్తున్నారు

ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ఒక విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో ఇద్దరు విద్యార్థులు సైకిల్ మీద కలిసి వెళ్తున్న సన్నివేశాన్ని మనం చూడొచ్చు. రొటీన్ కు భిన్నంగా ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా మనము ఒక అద్భుతమైన విలేజ్ డ్రామాను చూడబోతున్నాం అన్న విషయం మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగే ఒక అద్భుతమైన కథను ప్రేక్షకులకు అందించబోతోంది రాజా రమ్యం అనే ఈ సినిమా.

ఈ మధ్యకాలంలో వచ్చిన ఎన్నో సినిమాలు రూరల్ డ్రామాలు కాగా అదే కోవకు చెందిన ఈ సినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను ప్రేక్షకులకు తెలియజేయబోతున్నారు దర్శక నిర్మాతలు.

సాంకేతికవర్గం :

దర్శకత్వం : ప్రనీల్ గౌరిపాగ
కథ & స్క్రీన్ ప్లే : అర్వన్ గండికోట (జి యాదగిరి)
నిర్మాతలు : కోకొండ జయచందర్ రెడ్డి, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల
బ్యానర్లు : గవి ఫిల్మ్స్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్
సంగీతం : చరణ్ అర్జున్
ఎడిటర్ : ప్రదీప్ ఆర్ మోరం
డీ ఓ పి : ప్రవీణ్ కె బంగారి