రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి మూవీ పాట విడుదల

రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి నుండి శృంగార గీతం ధిర ధిరన లిరికల్ వీడియో విడుదల

తన్విక అండ్ మొక్షిక క్రియేషన్స్ పతాకంపై నూతన తారలు రవితేజ నున్న హీరోగా, నేహ జురెల్ హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి. సత్య రాజ్ దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి రామిసెట్టి సుబ్బారావు, ముత్యాల రామదాసు నిర్మాతలు.

యువ ప్రతిభావంతులు కలిసి రూపొందిస్తున్న రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ఐ లవ్ యు గీతం ప్రేక్షకులను కట్టిపడేసింది. తాజాగా ఈ చిత్రం నుంచి శృంగార గీతం ధిర ధిరన లిరికల్ వీడియో విడుదలైంది.

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్ సాలూరి ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం చేయటం విశేషం. రోషన్ సాలూరి స్వరపరిచిన ధిర ధిరన గీతం ఆకట్టుకుంటోంది. సాహితి చాగంటి ఆలపించిన ఈ పాటకు రెహమాన్ సాహిత్యం అందించారు. రోషన్ సాలూరి మధురమైన సంగీతానికి సాహితి చాగంటి గాత్రం, రెహమాన్ సాహిత్యం తోడై పాట మరింత అందంగా మారింది. లిరికల్ వీడియోలో నాయికా నాయకుల మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. థియేటర్లలో ఈ సాంగ్ యువత మనసు దోచుకోవడం ఖాయమనిపిస్తోంది.

రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి చిత్ర కథాంశం, ఈ తరం సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని చిత్ర బృందం చెబుతోంది. ఇప్పటికే విడుదలైన రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి టీజర్ మెప్పించింది. ప్రేక్షకులలో ఈ సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేయడానికి ఈ చిత్రం యొక్క ట్రైలర్ త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం కొద్ది రోజులలో థియేటర్లలో కుటుంబ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.

తారాగణం:

రవితేజ నున్నా, నేహా జురెల్, నాగినీడు,ప్రమోదిని, జబర్దస్త్ బాబీ,జబర్దస్త్ అశోక్, పుష్ప దుర్గాజి
యోగి ఖత్రి , అజిజ్ భాయ్, వీరేంద్ర, గిద్ద మోహన్, అప్పిరెడ్డి, కంచిపల్లి అబ్బులు, శ్రావణి

సాంకేతిక బృందం:

సంగీతం: రోషన్ సాలూరి
ఛాయాగ్రహణం: మురళి కృష్ణ వర్మ
కూర్పు: కిషోర్ టి
దర్శకత్వం: సత్య రాజ్
నిర్మాతలు: రామిసెట్టి సుబ్బారావు, ముత్యాల రామదాస్