విడుదలకు సిద్దంగా ఉన్న బాబు మూవీ

Published On: January 19, 2024   |   Posted By:

విడుదలకు సిద్దంగా ఉన్న బాబు మూవీ

అర్జున్ కళ్యాణ్ హీరోగా, కుషిత కల్లాపు హీరోయిన్‌గా రాబోతోన్న చిత్రం బాబు. ట్యాగ్ లైన్ నెంబర్ వన్ బుల్ షిట్ గై. డీడీ క్రియేషన్స్ బ్యానర్ మీద దండు దిలీప్ కుమార్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎల్ఆర్ (లక్ష్మణ్ వర్మ) ఈ సినిమాకు దర్శకుడు. విలాసం కన్నా అవసరం గొప్పది అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కించారు.

ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉండబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. త్వరలోనే విడుదలకు సిద్దం కానుంది. ఇప్పటికే వదిలిన ప్రమోషనల్ కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది. ఇక మున్ముందు మరింతగా ప్రమోషనల్ కార్యక్రమాలను పెంచనున్నారు మేకర్లు.

నటీనటులు :

అర్జున్ కళ్యాణ్, కుషిత కల్లాపు, ఎంఎల్ఆర్, సోనాలి, మురళీధర్ గౌడ్, భద్రం, జబర్దస్త్ అప్పారావు, రవి వర్మ, సునిత మనోహర్, అశోక్ వర్దన్, భద్రి జార్జి తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక బృందం :

బ్యానర్ : డీడీ క్రియేషన్స్
నిర్మాత : దండు దిలీప్ కుమార్ రెడ్డి
దర్శకుడు : ఎంఎల్ఆర్ (లక్ష్మణ్ వర్మ)
సంగీత దర్శకుడు : పవన్
కెమెరామెన్ : పీఎస్ మణికర్నన్
ఎడిటర్ : డి. వెంకటప్రభు