శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న మధురం మూవీ

Published On: February 17, 2024   |   Posted By:

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న మధురం మూవీ

యువ హీరో ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ మధురం. సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు..

చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ.. ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.. మా నిర్మాత బంగార్రాజు అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మధురం చిత్రాన్ని చాలా రిచ్ గా నిర్మించారు.. అన్నారు.

నిర్మాత యం. బంగార్రాజు మాట్లాడుతూ.. మా దర్శకుడు రాజేష్ చెప్పిన కథ అధ్భుతంగా నచ్చింది.. కొత్తదనం వున్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు.. అలాగే మా మధురం సినిమా కూడా చాలా కొత్తగా నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా వుంటుంది. కచ్చితంగా చాలా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం మాకు ఉంది. ఇటీవలే మా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో విశ్వక్ సేన్ రిలీజ్ చేశారు.. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆయనకి మా కృతజ్ఞతలు. హైదారాబాద్, పాలకొల్లు, ఆచంట, సిద్ధాంతం, రావులపాలెం, కోనసీమ ఏరియాలో షూటింగ్ చేయడం జరిగింది. ఈ చిత్రంలో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి.. మా మ్యూజిక్ డైరెక్టర్ వెంకీ వీణ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు.. పాటలన్నీ కూడా కోనసీమ, మారెడుమిల్లి, రంపచోడవరం వంటి సుందరమైన ప్రదేశాలలో చిత్రీకరించాం.. షూటింగ్ అంతా పూర్తి అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి.. త్వరలోనే సెన్సార్ పూర్తి చేసి సమ్మర్ లోనే సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేస్తాం అన్నారు.

హీరో ఉదయ్ రాజ్ మాట్లాడుతూ..  రీసెంట్ గా నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను.. అలాగే కొన్ని హిట్ మూవీస్ లో మంచి క్యారెక్టర్స్ చేశాను. అవి చూసి డైరెక్టర్ రాజేష్, మా నిర్మాత బంగార్రాజు గారు ఈ సినిమాలో హీరోగా నటించే అవకాశాన్ని ఇచ్చారు.. వారికి నా థాంక్స్. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే టీనేజ్ లవ్ స్టొరీ ఇది. నా క్యారెక్టర్ అందరికీ కనెక్ట్ అయ్యేలా వుంటుంది.. యూత్ కే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చేలా ఈ చిత్రం వుంటుంది.. రీసెంట్ గా మా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన విశ్వక్ సేన్ గారికి నా స్పెషల్ థాంక్స్.. అన్నారు.

నటీనటులు :

ఉదయ్ రాజ్, వైష్ణవీ సింగ్, కోటేశ్వర రావు (బస్ స్టాప్), కిట్టయ్య , యప్. యం. బాబాయ్, దివ్య శ్రీ, సమ్యు రెడ్డి, జబర్దస్త్ ఐశ్వర్య, ఉష, అప్పు, రామ్

సాంకేతిక వర్గం :

కెమెరామెన్; మనోహర్ కొల్లి
మ్యూజిక్; వెంకీ వీణ
ఎడిటర్; ఎన్టీఆర్
నిర్మాత; యం. బంగార్రాజు
కథమాటలుస్రీన్ ప్లే దర్శకత్వం; రాజేష్ చికిలే