సత్యభామ చిత్రంలో  నవీన్ చంద్ర లుక్ విడుదల

Published On: December 9, 2023   |   Posted By:

సత్యభామ చిత్రంలో  నవీన్ చంద్ర లుక్ విడుదల

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న కొత్త సినిమా “సత్యభామ”.
ఈ చిత్రంలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తోంది. “సత్యభామ” చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉందీ సినిమా.
ఇవాళ “సత్యభామ” సినిమా నుంచి టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర నటిస్తున్న అమరేందర్ క్యారెక్టర్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నవీన్ చంద్ర పర్ ఫార్మెన్స్ టెర్రఫిక్ గా ఉంటుందని మేకర్స్ వెల్లడించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది
నటీనటులు – కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర, తదితరులు
టెక్నికల్ టీమ్
బ్యానర్: అవురమ్ ఆర్ట్స్
స్క్రీన్ ప్లే, మూవీ ప్రెజెంటర్ : శశి కిరణ్ తిక్క
నిర్మాతలు : బాబీ తిక్క,  శ్రీనివాసరావు తక్కలపెల్లి
కో ప్రొడ్యూసర్ – బాలాజీ
సినిమాటోగ్రఫీ – జి విష్ణు
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
పీఆర్ఓ: జీఎస్ కే మీడియా
దర్శకత్వం: సుమన్ చిక్కాల