సైంధవ్ మూవీ స్ట్రీమింగ్ విడుదల తేదీని ప్రకటించిన అమెజాన్ ప్రైమ్

Published On: January 31, 2024   |   Posted By:

సైంధవ్‌ మూవీ స్ట్రీమింగ్‌ విడుదల తేదీని ప్రకటించిన అమెజాన్ ప్రైమ్‌

తెలుగు యాక్షన్ థ్రిల్లర్‌ సైంధవ్‌ గ్లోబల్‌ స్ట్రీమింగ్‌ విడుదలను ప్రకటించిన ప్రైమ్‌ వీడియో

శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్‌ బోయినపల్లి నిర్మాతగా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మించిన సైంధవ్‌ చిత్రంలో వెంకటేష్‌ దగ్గుబాటి, శ్రద్ధా శ్రీనాథ్‌, రుహానీ శర్మ, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆర్య, ఆండ్రియా జెర్మియా ప్రధాన పాత్రల్లో నటించారు.

భారతదేశం సహ ప్రపంచవ్యాప్తంగా 240 దేశాలు, ప్రాదేశిక ప్రాంతాల్లోని ప్రైమ్‌ సభ్యులు ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రాన్నితెలుగు సహ తమిళ్, ఫిబ్రవరి 3 నుంచి చూడవచ్చు

ముంబయి, ఇండియా జనవరి 31, 2024 భారతదేశం అమితంగా ఇష్టపడే వినోదకేంద్రం ప్రైమ్‌ వీడియో తెలుగు యాక్షన్ థ్రిల్లర్‌ సైంధవ్‌ స్ట్రీమింగ్‌ను నేడు ప్రకటించింది. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్‌ బోయినపల్లి నిర్మాతగా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకటేష్‌ దగ్గుబాటి హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్‌, రుహానీ శర్మ, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆర్య, ఆండ్రియా జెర్మియా ప్రధాన పాత్రల్లో నటించారు. భారతదేశం సహ ప్రపంచవ్యాప్తంగా 240 దేశాలు, ప్రాదేశిక ప్రాంతాల్లో ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రాన్నితెలుగుతో పాటు తమిళ్, ఫిబ్రవరి 3 నుంచి చూడవచ్చు. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌లో సైంధవ్‌ సరికొత్త చేరిక. సంవత్సరానికి కేవలం ₹1499 మెంబర్‌షిప్‌తో భారతదేశంలోని ప్రైమ్‌ సభ్యులు పొదుపు, సౌకర్యం, వినోదం అన్ని పొందవచ్చు.

కదిలించే భావోద్వేగాలు, కట్టిపడేసే యాక్షన్‌తో కూడిన ఈ చిత్రంలో వెంకటేష్‌ దగ్గుబాటి సైంధవ్‌ కోనేరు అలియాస్‌ సైకో పాత్రలో నటించారు. బాధకరమైన గతాన్ని కలిగిన సైకో, వాటిని పక్కన పెట్టి కూతురు గాయత్రితో కలిసి బాధ్యతాయుతమైన తండ్రిగా ఒక సాధారణ జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. అయితే గాయత్రికి ప్రాణాంతకమైన వ్యాధి ఉన్నట్టు తేలడంతో ఆ ప్రశాంతత చెదిరిపోతుంది. కఠినమైన పరిస్థితిని ఎదుర్కొన్న సైకో తన కూతురిని ఎలాగైనా కాపాడుకోవాలనే నిశ్చయంతో చీకటి సామ్రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. దీంతో పాత విరోధులతో మళ్లీ పోరాటం చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఈ చిత్రంలో పోషించిన కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ పాత్ర వికాస్‌ మాలిక్‌ ద్వారా నవాజుద్దీన్‌ సిద్ధిఖీ తెలుగులోకి తెరంగేట్రం చేశారు. కాలానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సైకో మరి ముంచుకొస్తున్న ముప్పు నుంచి తన కుమార్తె రక్షించుకోవడంలో విజయం సాధిస్తాడా? తెలుసుకోవాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 3 నుంచి స్ట్రీమ్ అయ్యే సైంధవ చూడాల్సిందే.