స్వయంభు మూవీ కోసం హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్న హీరోయిన్ సంయుక్తా మీనన్

Published On: February 12, 2024   |   Posted By:

స్వయంభు మూవీ కోసం హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్న హీరోయిన్ సంయుక్తా మీనన్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది సంయుక్తా మీనన్. ఆ తర్వాత వరుసగా ఘన విజయాలు సాధిస్తూ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఎదిగింది. బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్ సినిమాలతో తన సక్సెస్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆమె హీరో నిఖిల్ స్వయంభులో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం హార్స్ రైడింగ్ నేర్చుకుంటోంది సంయుక్తా మీనన్. హార్స్ రైడింగ్ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.

ఈ పోస్టులో సంయుక్త మీనన్ స్పందిస్తూ  ఈ ఏడాది ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటూ జీవితం అంటే ఏంటో తెలుసుకుంటున్నాను. నా జీవితమంతా సాహసాలతోనే సాగుతోంది. కంఫర్ట్ గా ఒకే చోట ఉండిపోవడాన్ని ఇష్టపడను. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకునేందుకు అడుగులు వేస్తుంటా. నా కొత్త సినిమా స్వయంభు కోసం హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నా. హార్స్ రైడింగ్ నేర్చుకోవడం కొత్త మానసిక అనుభూతిని కలిగిలిస్తోంది. అపజయాలనే విజయాలకు మెట్లుగా మార్చుకుంటున్నా అని పేర్కొంది.