హీరో రోషన్ కనకాల ఇంటర్వ్యూ

Published On: December 28, 2023   |   Posted By:

హీరో రోషన్ కనకాల ఇంటర్వ్యూ

యాక్టర్ కావాలనేది నా కల. అది బబుల్‌గమ్ తో నెరవేరడం ఆనందంగా వుంది. న్యూ ఏజ్ కంటెంట్ తో వస్తున్న బబుల్‌గమ్ తప్పకుండా అందరినీ అలరిస్తుంది: హీరో రోషన్ కనకాల

టాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం బబుల్‌గమ్. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో రోషన్ కనకాల విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

హీరో కావాలనే ఆలోచన మీదా ? అమ్మా నాన్నలదా ?
నాదే. చిన్నప్పటి నుంచి నటుడు కావాలనేది నా కోరిక. సినిమాని ముందుకు తీసుకెళ్ళే కథానాయకుడిగా చేయలనే కోరిక ఎప్పటినుంచో వుండేది. అలా దర్శకుడు రవికాంత్ ని కలవడం, ఆయనకి నాతో సినిమా చేయాలని అనిపించడంతో ఈ ప్రయాణం మొదలైయింది.

మీ తాతగారు ఎంతోమందికి నటనలో శిక్షణ ఇచ్చేవారు కదా.. ఆ రకంగా నటనపై ఆసక్తి ఏర్పడిందా?
నా బాల్యం అంతా దాదాపుగా తాతగారి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లోనే గడిచింది. మేము ఫస్ట్ ఫ్లోర్ లో వుంటే ఇన్స్టిట్యూట్ గ్రౌండ్ ఫ్లోర్ లో వుండేది. సబ్ కాన్షియస్ గా దాని ప్రభావం వుంటుంది. అయితే నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం. అది తెలియని ఒక థ్రిల్ ఇస్తుంది. దానిని చేజ్ చేసుకుంటునే ఇక్కడి వరకూ వచ్చాను. ఇలానే కొనసాగిస్తాను.

నటనలో శిక్షణ తీసుకున్నారా ?
తాతగారి దగ్గర రెండు నెలల పాటు శిక్షణ తీసుకున్నాను. తర్వాత లాస్ ఏంజలెస్ ఒక కోర్స్ చేశాను. పాండిచ్చేరి లో ఒక కోర్స్ చేశాను. అలాగే నాన్నతో చర్చించి కొన్ని ప్రాక్టీస్ చేస్తుంటాను.

సెట్ కి వచ్చినపుడు న్యూ కమ్మర్ లా ఫీలయ్యారా ?
రవికాంత్ నేను.. నెల ముందు వర్క్ షాప్ చేసుకున్నాం, అందుకే సెట్ పైకి వచ్చినపుడు న్యూ కమ్మర్ లా అనిపించలేదు.

ట్రైలర్, టీజర్ లో మీరు చూపించిన నటనకు చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయి ? ఓవరాల్ గా ఎలా ప్రిపేర్ అయ్యారు ?
వర్క్ షాప్ చేసిన తర్వాత షూటింగ్ మొదలుపెట్టాలని ముందే నిర్ణయించుకున్నాం. స్క్రిప్ట్ ని రిహార్సల్ చేసుకున్నాం. ఒక సీన్ లో ఎలా చేయాలి, ఎలాంటి ఎమోషన్ కన్వే అవ్వాలి, ఎలాంటి కాస్ట్యూమ్ వుండాలి.. ఇవన్నీ ముందు అనుకున్నాం. ఆ ప్రిపరేషన్ చాలా హెల్ప్ అయ్యింది.

మీ ఏజ్ గ్రూప్ వున్న పాత్రే చేశారు కదా.. రవికాంత్ మీ దగ్గర నుంచి ఎలాంటి ఇన్పుట్స్ తీసుకున్నారు ?
రవికాంత్ చాలా ఓపెన్ గా ఉంటాడు. ఈ కథ నా ఏజ్ గ్రూప్ కి సంబధించినది. కొన్ని సీన్స్ లో నాకు ఏం అనిపిస్తుంది ? నేను ఎలా రియాక్ట్ అవుతాను..ఇలా కొన్ని ఇన్పుట్స్ తీసుకున్నారు. సినిమా బెటర్ మెంట్ కోసం అందరి ఆలోచనలని పరిశీలించే దర్శకుడు రవికాంత్.

మీ అమ్మానాన్నలకు పరిశ్రమలో చాలా మంచి పేరుంది.. ఇప్పుడు మీరు హీరోగా వస్తున్నారు.. ఈ విషయంలో ప్రెసర్ ఉందా ? ప్లెజర్ ఉందా?
ఖచ్చితంగా ప్లెజర్ వుంది. నా జీవితంలో కోరుకున్నది ఇదే. అది నెరవేరడం ఆనందంగా వుంది. సినిమాపై పూర్తి నమ్మకం వుంది. కంటెంట్ పరంగా చాలా నమ్మకంగా వున్నాం.

చిరంజీవి గారిని కలిసినప్పుడు ఏమైనా సూచనలు ఇచ్చారా ?
ఇజ్జత్ పాట లాంచ్ చేయడానికి చిరంజీవి గారిని కలిశాం. మా సినిమా కాన్సప్ట్ ఇజ్జత్ ఇచ్చిపుచ్చుకోవడం. సాంగ్ లాంచ్ సమయంలో వారి జీవితంలో ఎదురైన అనుభవాలు గురించి చెప్పారు. అలాగే బిగ్ బాస్ కి వెళ్ళినపుడు నాగార్జున గారితో వీడియో చేశాం. మొదట ఆడియో రికార్డ్ కాలేదు. ఆయన్ని అడిగితే .. మరోసారి చేశారు. అది చాలా గొప్పగా అనిపించింది.

అమ్మా నాన్నలు ఏవైనా సలహాలు సూచనలు ఇచ్చారా ?
అమ్మా నాన్నలతో చర్చిస్తాను. నటన పరంగా వారి నుంచి సలహాలు సూచనలు తీసుకుంటాను. ఏవైనా సందేహాలు వున్నా అడుగుతుంటాను. అమ్మా నాన్న సినిమా చూశారు. అయితే అప్పుడు అక్కడ నేను లేను. నాన్న కొన్ని సీన్స్ లో ఏడ్చారని అమ్మ చెప్పింది. నాన్నని అడిగితే బాగా చేశావ్ అన్నారు. నాన్న సహజంగా ఒప్పుకోరు. ఆయన నుంచి అలాంటి కాంప్లిమెంట్ రావడం ఆనందంగా అనిపించింది. అమ్మకు కూడా చాలా నచ్చింది.

ఇందులో షర్టు లెస్ సీన్ హైలెట్ గా వుంటుందని విన్నాం ?
అవునండీ.. ఆ సీన్ షూటింగ్ ఎప్పటికీ మర్చిపోలేని అనుభువం. దాదాపు మూడు గంటలు పాటు షర్టు లేకుండా సిటీ అంతా తిరిగాను. ఒక పాయింట్ లో నా సిగ్గు అంతా పోయింది( నవ్వుతూ). నా దృష్టి అంతా ఆ సీన్, అందులోని ఎమోషన్ పైనే పెట్టాను. ఆ సీన్ తో చాలా విషయాలు నేర్చుకున్నాను

హీరోయిన్ మానస గురించి ?
మానస పెర్ఫార్మెన్స్ చూసి సర్ప్రైజ్ అయ్యాను. చాలా అద్భుతంగా చేసింది. డబ్బింగ్ కూడా చాలా చక్కగా చెప్పింది. తను చాలా ఫ్రెండ్లీగా వుంటుంది.

శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ గురించి ?
ఈ సినిమా కోసం శ్రీచరణ్ చాలా కొత్త సౌండ్ ని క్రియేట్ చేశాడు, పాటలన్నీ ఇప్పటికే హిట్ అయ్యాయి. ఇంటర్వెల్ బ్లాక్ ఇచ్చిన మ్యూజిక్ గూస్ బంప్స్ వస్తాయి. సినిమా మొత్తం చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.
ఇందులో ఒక పాట పాడాను. అయితే దీనికి కోసం ప్రత్యేక శిక్షణ ఏమీ తీసుకోలేదు. దర్శకుడు, సంగీత దర్శకుడు కోరడంతో అది అలా జరిగిపోయింది.(నవ్వుతూ)

నిర్మాతలు గురించి ?
విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు చాలా సపోర్ట్ చేశారు. బలంగా నమ్మారు. ఏ ఇబ్బంది లేకుండా ప్రతిది సమకూర్చారు.

సిద్దు జొన్నల గడ్డ బ్రదర్ కూడా ఇందులో నటిస్తున్నారు కదా.. ఆయన పాత్ర ఎలా వుంటుంది ?
జైరాం ఈశ్వర్ గారు ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారు. నిజంగా ఆయన సర్ ప్రైజ్ ప్యాకేజ్. ఆయన నటన అందరినీ అలరిస్తుంది.

సునీత గారి అబ్బాయి కూడా తన తొలి సినిమాతో వస్తున్నారు..మీ మధ్య పరిచయం ఉందా ?
పరిచయం వుంది. అప్పుడప్పుడు కలిసిన సందర్భాలు వున్నాయి. ట్రైలర్ బావుంది. నేచురల్ గా కనిపిస్తోంది. ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను.

మీకు నచ్చే జోనర్ ? కొత్తగా చేయబోయే సినిమాల గురించి?
ప్రత్యేకమైన జోనర్ అంటూ ఏమీ లేదు. మంచి సినిమా ఏదైనా ఇష్టం. ప్రేక్షకులని ఎంగేజ్ చేసే ప్రతి సినిమా ఇష్టం.
కథలు వింటున్నాను. ప్రస్తుతం నా ద్రుష్టి బబుల్‌గమ్ విడుదలపైనే వుంది