2023 లో చక్రం తిప్పుతున్న మారన్ కుటుంబం

Published On: December 19, 2023   |   Posted By:

2023 లో చక్రం తిప్పుతున్న మారన్ కుటుంబం

In Picture: Kavya Maran (In the middle)

In Picture: Kavya Maran (In the middle)

కళానిధి మారన్, ఇది సినీ ఇండస్ట్రీలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఆయన సిని నిర్మాత అని తెలిసిన విషయమే..ఈయన ఈ సంవత్సరం, జైలర్ సినిమా తీసి ఇండస్ట్రీలో చక్రం తిప్పాడు. అతని కూతురు కావ్య మారన్ గురించి కూడా పరిచయం లేని క్రికెట్ అభిమాని ఉండడు. ఐపీఎల్ ఆక్షన్ ని కూడా కుర్రాళ్ళు ఒక ఫైనల్ మ్యాచ్ లాగా చూస్తున్నారు అంటే అది కావ్య కోసమే అని చెప్పాలి. ఐపీఎల్ ఆక్షన్ మరియు సన్ రైజర్స్ మ్యాచ్ ఉన్న ప్రతీసారి కావ్య సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా ఉంటుంది.

అలానే ఈసారి కూడా కావ్య సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయింది. ఈరోజు జరుగుతున్న ఐపీఎల్ ఆక్షన్ లో సన్రైజర్స్ తరఫున ఆక్షన్ లో కూర్చున్న కావ్య, 2023 వరల్డ్ కప్ విజేత అయిన ఆస్ట్రేలియన్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ని ,  ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక రేటుకు సొంతం చేసుకుంది. ముందుగా ఈ ఆటగాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం వాళ్ళు బిడ్ చేస్తుండగా 8 కోట్ల దగ్గర కావ్యా మారన్ తన బిడ్ ని ప్రారంభించింది. ఆ ఎనిమిది కోట్ల దగ్గర్నుంచి పోటాపోటీగా బిడ్ చేస్తూ ప్యాట్ కమిన్స్ ను ఏకంగా 20 కోట్ల 50 లక్షల కు సొంతం చేసుకుంది. దీంతో ఈ బిడ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా నిలిచిపోయింది. ప్యాట్ కమిన్స్ తో పాటు హసరంగా ని 1.5 కోట్లకు, హెడ్ నా ఆరు కోట్లకు గాను సొంతం చేసుకుంది. పక్క టీం తో పోటా పోటీగా.. ఏమాత్రం తగ్గకుండా బిడ్ చేసి గెలిచిందని కావ్యా మీద సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

ఈ సంవత్సరంలో, తండ్రి మారన్ జైలర్ సినిమాను నిర్మించి లాభాలు బాట పట్టగా.. కూతురు కావ్య మారన్ ఐపీఎల్ లో అత్యధిక బిట్ చేసి సెన్సేషన్ గా నిలిచింది. అటు సినిమాల్లో, ఇటు క్రికెట్లో,  ఇండస్ట్రీ తో సంబంధం లేకుండా  మారన్ కుటుంబం వాళ్లు  వాళ్ల ఉనికిని చాటుతున్నారు.